IND VS SA: నిలవాలంటే గెలవాల్సిందే.. దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే నేడు.. పిచ్ ఎలా ఉందంటే..

దక్షిణాఫ్రికా  మొదటి టెస్టుపై గెలిచిన టీమిండియా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ ఓటమి పాలై సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా పరాజయంతో ప్రారంభించింది.

IND VS SA: నిలవాలంటే గెలవాల్సిందే.. దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే నేడు.. పిచ్ ఎలా ఉందంటే..
Follow us
Basha Shek

|

Updated on: Jan 21, 2022 | 5:53 AM

దక్షిణాఫ్రికా  మొదటి టెస్టుపై గెలిచిన టీమిండియా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ ఓటమి పాలై సిరీస్ ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్ ను కూడా పరాజయంతో ప్రారంభించింది. ఈ క్రమంలో వన్డే సిరీస్ లో నిలవాలంటే శుక్రవారం జరిగే రెండో వన్డేలో సఫారీలపై కచ్చితంగా గెలవాల్సిందే. మొదటి మ్యాచ్ లో మిడిలార్డర్ వైఫల్యంతో 31 పరుగులతో ఓటమిపాలైన టీమిండియా ఈ వన్డేలో గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. మరోవైపు వరుస విజయాలను కొనసాగిస్తూ రెండో వన్డేలోనే సిరీస్ గెలావాలని సఫారీ జట్టు కోరుకుంటోంది. ఈక్రమంలో మొదటి వన్డే జరిగిన బోలాండ్ పార్క్ లోనే మరోసారి టీమిండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.  భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

రాహుల్ కెప్టెన్సీకిపరీక్ష

కాగా ఈ మ్యాచ్ తాత్కాలిక కెప్టెన్ కే ఎల్ రాహుల్ పెద్ద పరీక్ష గా నిలవనుంది. తొలి మ్యాచ్ లో పేలవమైన కెప్టెన్సీతో  విమర్శలు ఎదుర్కొన్న అతను విజయంతో వాటికి చెక్ పెట్టాల్సి ఉంది. టెస్ట్ కెప్టెన్సీకి అతని పేరు కూడా బలంగా వినిపిస్తోన్న నేపథ్యంలో తన కెప్టెన్సీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.  వ్యక్తిగతంగా బ్యాటింగ్ లోనూ రాణించాల్సి ఉంటుంది.  కోహ్లీ, ధావన్ తమ జోరును అలాగే కొన సాగించాల్సి ఉండగా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ భారీ ఇన్నింగ్స్ లు ఆడాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇక కొత్త ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కూడా తన ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంది. ఇక బౌలింగ్  విషయానికి వస్తే .. మొదటి మ్యాచ్ లో బుమ్రా తప్ప మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్ లో అర్ధసెంచరీ చేసినప్పటికీ బౌలింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు శార్దూల్ ఠాకూర్. స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ సఫారీలను పెద్దగా కష్టపెట్టలేకపోయాడు.  స్పిన్నర్లు అశ్విన్, చాహల్ కూడా తమ శక్తి మేర రాణించాల్సి ఉంది. ఇక ప్రొటీస్ జట్టు ఆత్వవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. అనుభవం లేనప్పటికీ వాండర్ డసెన్, కెప్టెన్ తెంబా బవుమా మొదటి మ్యాచ్ లో సెంచరీలతో రాణించారు. రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నారు. బౌలింగ్ రబాడా లేకున్నా యువ బౌలర్లు ఆకట్టుకుంటున్నారు. స్పిన్నర్లు కూడా రాణిస్తున్నారు.

పిచ్ ఎలా ఉందంటే…

మొదటి వన్డే జరిగిన పార్ల్ మైదానంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. కాబట్టి పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. పిచ్ మందకొడిగా ఉండి స్నిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఇక క్రీజ్ లో నిలదొక్కుకుంటే బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్ లు ఆడవచ్చని సౌతాఫ్రికా క్రికెటర్లు మొదటి మ్యాచ్ లో నిరూపించారు. చలి ప్రభావం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Also Read: Coronavirus: మొన్న తండ్రి.. నేడు కుమారుడు.. కరోనా బారిన పడ్డ స్టార్ హీరో..

AHA Unstoppable: ఫ్యాన్స్ నిరీక్ష‌ణకు ఫుల్‌స్టాప్‌.. బాల‌య్య షోలో మ‌హేష్ సంద‌డి ఎప్పుడంటే..

AHA Unstoppable: ఫ్యాన్స్ నిరీక్ష‌ణకు ఫుల్‌స్టాప్‌.. బాల‌య్య షోలో మ‌హేష్ సంద‌డి ఎప్పుడంటే..