Viral News: ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్‌లలో రూ. 960 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే.!
Viral News: సాధారణంగా ఓ మిడిల్ క్లాస్ విద్యార్ధి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 500 నుంచి రూ. 1500 వరకు డబ్బు ఉండొచ్చు. ఇంకా అంతకమించి అయితే..
సాధారణంగా ఓ మిడిల్ క్లాస్ విద్యార్ధి బ్యాంక్ అకౌంట్‌లో రూ. 500 నుంచి రూ. 1500 వరకు డబ్బు ఉండొచ్చు. ఇంకా అంతకమించి అయితే రూ. 3000 వరకు ఉంటుంది. కానీ ఇక్కడ ఓ ఇద్దరు విద్యార్ధుల అకౌంట్‌లో ఏకంగా రూ. 960 కోట్లు జమ అయ్యాయి. ఆ అమౌంట్ చూసిన వారి తల్లిదండ్రులు.. విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలు ఇంతకీ ఆ విద్యార్ధుల ఖాతాల్లోకి అంత డబ్బు ఎలా వచ్చింది.? అసలేం జరిగింది.? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బీహార్‌లో ఓ అరుదైన ఘటన తెర మీదకు వచ్చింది. ఇద్దరు విద్యార్థుల బ్యాంక్ అకౌంట్‌లో.. ఏకంగా రూ. 960 కోట్ల రూపాయలు జమయ్యాయి. అవును మీరు విన్నది నిజమే.. అక్షరాల తొమ్మిది వందల కోట్ల రూపాయలే.! ఇక ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు.. ఒక్కసారిగా ఎగిరిగంతేశారు. కటిహార్ జిల్లాలోని బౌరా పంచాయితీ పరిధిలోని పస్తియా గ్రామానికి చెందిన ఆశిష్, విశ్వాస్ అనే ఇద్దరు విద్యార్థులకు బిహార్ గ్రామీణ్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. వీరి పాఠశాల యూనిఫామ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నగదు తమ ఖాతాలో జమ అయ్యిందో లేదో అని తెలుసుకునేందుకు తమ తల్లిదండ్రులతో కలిసి ఊరిలోని ఇంటర్నెట్ వద్దకు వెళ్లారు. వీరి అకౌంట్ నెంబర్‌ను సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌లో టైప్ చేసి చూసి, ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఆరో తరగతి చదివే ఆశిత్ కుమార్ ఖాతాలో రూ.900 కోట్లు.. గురు చరణ్ విశ్వాస్ ఖాతాలో రూ.60 కోట్ల రూపాయలు జమయ్యాయి. ఈ సంఘటనపై బ్యాంక్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. డబ్బుల విషయం తెలిసి బ్యాంక్ మేనేజర్ మనోజ్ గుప్తా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు అబ్బాయిల బ్యాంక్ అకౌంట్లలో భారీ మొత్తాన్ని గుర్తించినట్లు తమకు సమాచారం అందిందని దానిని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే టెక్నికల్ ఇష్యూ వల్లే ఇదంత జరిగిందని మనోజ్ గుప్పా చెప్పుకొచ్చాడు.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!