Viral: కొలనులో తవ్వుతుండగా మెరుస్తూ ఏదో కనిపించింది.. తవ్వి తీయగా స్టన్
శ్రావణమాసం మరో రెండు రోజుల్లో రాబోతోంది. ఈలోగా ఓ చోట కొలనులో తవ్వకాలు జరిపారు స్థానికులు. అంతే.! మిలమిలా మెరుస్తూ బయటపడింది ఓ శివలింగం.. దాని చరిత్ర తెలుసుకుని దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

భారత దేశం ఆథ్యాత్మికతకు నిలయం. అందుకే దీనిని వేదభూమి అంటారు. దీనిని రుజువు చేస్తూ పలు చోట్ల తవ్వకాల్లోనో, దేవతా విగ్రహాలు, నదీ ప్రవాహాల్లోనో దేవతా విగ్రహాలు బయటపడతూనే ఉన్నాయి. వందల ఏళ్ళనాటి విగ్రహాలు చెక్కుచెదరకుండా భూమిలో నిక్షిప్తమై ఉన్న విగ్రహాలు సమయం వచ్చిందన్నట్టుగా బయల్పడుతున్నాయి. రెండు రోజుల్లో శ్రావణమాసం రాబోతోంది. ఈ సందర్భంలో ఉత్తర ప్రదేశ్‌లో అద్భుత ఘటన చోటుచేసుకుంది. కొలను తవ్వుతుండగా పంచముఖి శివలింగం బయట పడింది. ఈ శివలింగం చాలా పురాతనమైనదని చెబుతున్నారు. శివలింగం బయటపడిన విషయం తెలుసుకొని స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తవ్వకాల్లో శివలింగం బయటపడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
యూపీలోని బదాయూ జిల్లా దాతాగంజ్ తహసీలు పరిధి సరాయ్ పిపరియా గ్రామంలో మంగళవారం కొలను తవ్వుతుండగా ఈ పంచముఖి శివలింగం బయటపడింది. ఇది దాదాపు 300 ఏళ్ల కిందటిది కావొచ్చని స్థానిక బ్రహ్మదేవ్ ఆలయ పూజారి మహంత్ పరమాత్మా దాస్ మహరాజ్ తెలిపారు. ఇక, ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల వారికి తెలియడంతో పంచముఖి శివలింగాన్ని చూసేందుకు పోటెత్తారు. కొలను తవ్వకం సమయంలో అక్కడే ఉన్న నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్త, పర్యావరణవేత్త శిప్రా పాఠక్ మాట్లాడుతూ… తన 13 ఎకరాల స్థలంలో తామరు కొలను ఏర్పాటుకు ఈ తవ్వకాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ స్థలంలోనే పంచతత్వ పౌధ్‌శాల పేరిట ఆమె నర్సరీని కూడా పెంచుతున్నారు. తన ఫౌండేషన్ ద్వారా యేటా 5 లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకొన్న పాఠక్ శివలింగం ఆవిర్భావాన్ని భగవదనుగ్రహంగా పేర్కొన్నారు. కాగా, శివలింగం పరిశీలనకు పురావస్తుశాఖ అధికారులకు సమాచారమిస్తామని దాతాగంజ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
