AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రీత్ ఎనలైజర్ టెస్టులో అడ్డంగా బుక్కై ఆర్టీసీ డ్రైవర్‌..! తాగకుండానే రీడింగ్‌ అమాంతంగ..

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు మద్యం సేవించలేదు. అయినప్పటికీ వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చింది. యంత్రం 10 రీడింగ్‌ను చూపించింది. ఇది నిర్దేశించిన పరిమితికి మించి ఉంది. డ్రైవర్లు తాము మద్యం సేవించలేదని చెప్పారు. కావాలంటే వారిని మరోమారు పరీక్షించమని పోలీసులను కోరారు.

బ్రీత్ ఎనలైజర్ టెస్టులో అడ్డంగా బుక్కై ఆర్టీసీ డ్రైవర్‌..! తాగకుండానే రీడింగ్‌ అమాంతంగ..
Breathalyzer Test
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2025 | 11:39 AM

Share

రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ట్రాఫిక్‌ పోలీసులు నిలబడి ఉండటం మనం తరచుగా చూస్తూనే ఉంటాం..ప్రమాదాలను నివారించేందుకు గానూ వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేస్తుంటారు. ఇది డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా అని చూపిస్తుంది. తనిఖీల సమయంలో మద్యం సేవించి వాహనం నడిపే వారికి జరిమానా విధిస్తారు. కానీ, ఎవరైనా మద్యం సేవించకపోయినా వారికి టెస్టులో పాజిటివ్ వస్తే ఎలా ఉంటుంది..? సరిగ్గా అలాంటి సంఘటనే ఎదురైంది ఒక ఆర్టీ డ్రైవర్‌ విషయంలో..ట్రాఫిక్ పోలీసులు పరీక్ష కోసం అతన్ని ఆపినప్పుడు అక్కడ కొంతమంది మద్యం సేవించకపోయినా పాజిటివ్‌గా వచ్చింది. దానికి ఏంటో తెలిసిన తరువాత అంతా నోరెళ్లబెట్టారు..

ఎలాంటి మద్యం తాగకుండానే బ్రీత్‌ ఎనలైజర్‌ టెస్టులో అడ్డంగా బుక్కయ్యాడు ఒక ఆర్టీసీ డ్రైవర్. KSRTC డ్రైవర్లను ట్రాఫిక్ పోలీసులు తనిఖీ కోసం ఆపారు. ఈ సమయంలో డ్రైవర్లు పూర్తి నిజాయితీతో లైన్‌లో నిలబడ్డారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వారు మద్యం సేవించలేదు. అయినప్పటికీ వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలో పాజిటివ్‌గా వచ్చింది. యంత్రం 10 రీడింగ్‌ను చూపించింది. ఇది నిర్దేశించిన పరిమితికి మించి ఉంది. డ్రైవర్లు తాము మద్యం సేవించలేదని చెప్పారు. కావాలంటే వారిని మరోమారు పరీక్షించమని పోలీసులను కోరారు.

తాము మద్యం సేవించలేదని, కానీ, ఇంతకు ముందే పనస పండు తిన్నామని డ్రైవర్లు పోలీసులకు చెప్పారు. దీని కారణంగానే పరీక్షలో రీడింగ్ పాజిటివ్‌గా వచ్చిందని చెప్పారు. దాంతో పోలీసులు తమపై తాము ఈ పరీక్ష చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా వారికి మొదటి పరీక్ష సరిగ్గా వచ్చింది. కానీ, జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత పరీక్ష చేసిన వెంటనే, పరీక్ష విఫలమైంది. ఇందులో, ఆ వ్యక్తి మత్తులో ఉన్నట్లు ప్రకటించారు. నివేదికల ప్రకారం, జాక్‌ఫ్రూట్ తిన్న తర్వాత ఇథనాల్ అవశేషాలు నోటిలో ఉంటాయి. కాబట్టి ఇది జరిగింది. దీని తర్వాత, పరీక్ష చేసినప్పుడు, అది పాజిటివ్‌గా వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..