AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైబర్‌ నేరగాళ్లు కాజేసిన రూ.2 కోట్లతో పారిపోయిన పోలీసు జంట.. కట్‌చేస్తే..

నిందితుల నుండి సుమారు కోటి రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, 12 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు ATM కార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బు నుండి నిందితులు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారని తెలిపారు.

సైబర్‌ నేరగాళ్లు కాజేసిన రూ.2 కోట్లతో పారిపోయిన పోలీసు జంట.. కట్‌చేస్తే..
Arrest
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2025 | 9:21 AM

Share

సైబర్‌ నేరగాళ్లు కాజేసిన సొమ్మును రికవరీ చేసి.. వాటితో ఓ పోలీసు జంట ఉడాయించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైబర్‌ నేరగాళ్ల నుంచి రికవరీ చేసిన రూ.2 కోట్ల సొమ్మును కాజేసి, కొత్త పేర్లతో జీవితం మొదలెట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసుల గుట్టు రట్టయ్యింది. ఢిల్లీ పోలీసు ఎస్సై అంకుర్‌ మాలిక్‌కు మరో మహిళా ఎస్సై నేహా పునియాతో సన్నిహిత సంబంధం ఉంది. దీంతో, వారు తమ జీవిత భాగస్వాములను విడిచి రూ.2 కోట్లు తీసుకుని పారిపోయారు. గోవా, మనాలీ, కశ్మీర్‌ ట్రిప్‌లతో విహరించారు. చివరకు వీరి కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేసి, ఇండోర్‌లో అరెస్ట్ చేశారు.

నిందితులు 2021 బ్యాచ్‌మేట్స్, కలిసి శిక్షణ పొందారు. మూడు చిటింగ్ కేసుల్లో కోట్ల విలువైన డబ్బును స్వాధీనం చేసుకుని వారిద్దరూ కలిసి పరారీలో ఉన్నారు. విషయం వెలుగులోకి రావడంతో ఢిల్లీ పోలీసుల ప్రతిష్టపై మాయని మచ్చ పడింది. దాదాపు నాలుగు నెలలపాటు గాలించిన ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇండోర్‌లో మకాం వేసిన ఇద్దరు పోలీస్‌ జంట, మరో ముగ్గురిని కూడా అరెస్టు చేశారు.

నిందితులు SI అంకుర్ మాలిక్, SI నేహా పునియాతో పాటు, వారి సహచరులు మొహమ్మద్ ఇలియాస్, అఫి అలియాస్ మోను, షాదాబ్‌లను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసు అధికారి తెలిపారు. నిందితుల నుండి సుమారు కోటి రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, 12 లక్షల నగదు, 11 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు ATM కార్డులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బు నుండి నిందితులు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని కొనుగోలు చేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..