Watch: మరీ ఇంత వాయిలెంట్‌గా ఉన్నావేంట్రా..! కాబోయే భార్యకోసం షాపింగ్ మాల్‌లో రెచ్చిపోయిన పెళ్లి కొడుకు..
ఇదిలా ఉండగా, కొంత సమయం తరువాత మేఘనకు కాబోయే భర్త దుకాణానికి చేరుకున్నాడు. లెహంగ నచ్చలేదని చెప్పి తిరిగి ఇచ్చేందుకు వెళ్లాడు. కానీ,షాపింగ్ మాల్ ఊహించని భయంకర సంఘటన చోటు చేసుకుంది. మేఘనకు కాబోయే భర్త సుమిత్ సయాని, దుకాణదారుల మధ్య వాదన జరిగింది. ఈ సమయంలో ఆమెకు కాబోయే భర్ సుమిత్ అకస్మాత్తుగా తన జేబులో నుండి ఒక కత్తిని తీసి దుకాణంలోని

వచ్చేది శ్రావణ మాసం.. అప్పుడే పెళ్లిళ్ల సీజన్ కోసం ఆడవాళ్లు షాపింగ్ మొదలుపెట్టేశారు. ఆషాడం ఆఫర్ల పేరుతో వ్యాపార సంస్థలు కూడా భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక షాపింగ్ మాల్ జరిగిన షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. అందులో ఒక అమ్మాయికి కాబోయే భర్త ఒక షాపింగ్ మాల్‌లో చేసిన పని అందరిని భయబ్రాంతులకు గురి చేసింది. రూ.32వేల లెహంగా కోసం అతడు చేసిన పనికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇంతకీ అతడు ఏం చేశాడు.. ఎందుకు పోలీసులు రావాల్సి వచ్చిందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు..
మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో జరిగిన ఒక సంఘటన ఇంటర్‌నెట్‌ని సైతం షాక్‌కు గురయ్యేలా చేసింది. కళ్యాణ్ వెస్ట్‌లో నివసించే మేఘనా మఖిజా అనే యుతి తన పెళ్లి కోసం దాదాపు 32 వేల రూపాయల విలువైన లెహంగాను కొనుగోలు చేసింది. కానీ, ఆమె ఇంటికి వెళ్లిన తరువాత తనకు ఆ లెహంగ నచ్చలేదు. దాంతో వెంటనే ఆమె దుకాణదారునికి ఫోన్ చేసి లెహంగాను తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. మీరు దానిని జూలై 31, 2025 వరకు తిరిగి ఇవ్వవచ్చని దుకాణదారుడు చెప్పాడు. కానీ, దానిని తిరిగి ఇచ్చిన తర్వాత మీకు డబ్బు రాదు, బదులుగా మీరు మరొకటి కొనుగోలు చేయవచ్చునని చెప్పారు.
ఇదిలా ఉండగా, కొంత సమయం తరువాత మేఘనకు కాబోయే భర్త దుకాణానికి చేరుకున్నాడు. లెహంగ నచ్చలేదని చెప్పి తిరిగి ఇచ్చేందుకు వెళ్లాడు. కానీ,షాపింగ్ మాల్ ఊహించని భయంకర సంఘటన చోటు చేసుకుంది. మేఘనకు కాబోయే భర్త సుమిత్ సయాని, దుకాణదారుల మధ్య వాదన జరిగింది. ఈ సమయంలో ఆమెకు కాబోయే భర్ సుమిత్ అకస్మాత్తుగా తన జేబులో నుండి ఒక కత్తిని తీసి దుకాణంలోని లెహంగాను చింపివేసాడు. అది చూసి అక్కడున్న వారంతా విస్తూ పోయారు.
అతడు అంతటితో ఆగలేదు..దుకాణదారుడిని కూడా బెదిరించాడు. లెహంగా లాగా మిమ్మల్ని కూడా ముక్కలు చేస్తానని బెదిరించాడు. అంతేకాదు..రూ.3 లక్షల రూపాయల పరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే దుకాణాన్ ధ్వంసం చేస్తానని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.
వీడియో ఇక్కడ చూడండి..
दुकानदार ने रिटर्न के बदले नहीं दिए पैसे, मंगेतर ने चाकू से फाड़ डाला लहंगा pic.twitter.com/1H12QOzblh
— DHARMENDRA SINGH (@iDharmksingh) July 21, 2025
ఇదంతా జరిగిన తరువాత దుకాణదారుడు నేరుగా కళ్యాణ్‌లోని బజార్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు. దుకాణదారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సుమిత్ సయానీని అరెస్టు చేసినట్టుగా తెలిసింది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.




