Telangana Video: గంజాయి మత్తులో వ్యక్తి హల్ చల్… కారును ఆపి..బానెట్‌పైకి ఎక్కి…
మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. మూసాపేటలో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఓ ఫ్యామిలీ ప్రయాణించే కారును ఆపి దాదాగిరికి దిగాడు. కారు బానెట్‌పైకి ఎక్కి ఫ్యామిలీపై దాడి చేయబోయాడు. ఆ వ్యక్తి గంజాయి మత్తులు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. కారుపైకి ఎక్కి...

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. మూసాపేటలో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఓ ఫ్యామిలీ ప్రయాణించే కారును ఆపి దాదాగిరికి దిగాడు. కారు బానెట్‌పైకి ఎక్కి ఫ్యామిలీపై దాడి చేయబోయాడు. ఆ వ్యక్తి గంజాయి మత్తులు ఉన్నట్లు స్థానికులు చెప్పారు. కారుపైకి ఎక్కి ముందుభాగంలోని అద్దం మీద నుంచి పలుమార్లు కొట్టడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తిని చూసి కారులోని ఫ్యామిలీ భయపడిపోయింది.
స్థానికులు కల్పించుకుని ఆ వ్యక్తిని కారు మీద నుంచి కిందకు దించారు. దీంతో కారులోని ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి చర్యలను ఫోన్‌లో రికార్డ్ చేయడంతో ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది. అలాంటి వ్యక్తులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
వీడియో చూడండి:
హైదరాబాద్ నగరం పోకిరీలకు అడ్డాగా మారుతుందని నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. . మద్యమత్తు, గంజాయి మత్తులో ఇతరులపై దాడులకు తెగబడుతున్నారు. పోలీసులు నిఘా పెట్టి కఠిన చుర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఓచోట ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గంజాయి, డ్రగ్స్ పట్ల పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు.
