AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..

మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.

మిర్యాలగూడలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన దుండగులు..! అర్ధరాత్రి కలకలం..
Rtc Bus Catches Fire
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2025 | 11:07 AM

Share

నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన కలకలం రేపింది. మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు గుర్తు తెలియని దుండగులు. జులై 22 అర్ధరాత్రి దాటిన తరువాత ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన బస్సు మిర్యాలగూడ డిపోకు చెందిన TS05Z0047 నంబర్‌గా గుర్తించారు. రోజువారీగా తడకమళ్ల గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్ కూడలిలో నైట్‌హాల్ట్ కోసం పార్క్ చేసి ఉంచారు. ఈ క్రమంలోనే గుర్తుతెలియని ఆకతాయిలు బస్సు వెనుక భాగంలో నిప్పు అంటించడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ ఘటనకు తాగుబోతులు లేదా గంజాయి బ్యాచ్ పనిగా అనుమానిస్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు మిర్యాలగూడ రూరల్‌ సీఐ పీఎన్‌డీ ప్రసాద్‌, ఎస్‌ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మరో వైపు ఆర్టీసీ అధికారులు సైతం గ్రామానికి చేరుకొని బస్సును పరిశీలించారు. బస్సును తగులబెట్టేందుకు ప్రయత్నించిన వారి ఆచూకీ కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..