AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉపాధికోసమని వెళ్లి చిక్కుల్లో పడ్డ తెలంగాణ కుర్రాడు.. 6 నెలలుగా దుబాయ్‌లోనే..

ఉద్యోగం కోసం దూబాయ్‌కు వెళ్లి ఒక అనధికారిక లావాదేవీల కేసులో అనుమానితుడుగా చిక్కుకుపోయాడు తెలంగాణకు చెందిన ఒక యువకుడు. ఉద్యోగం కోల్పోయి గత ఆరు నెలలుగా స్నేహితులతో ఉంటూ స్వదేశానికి వచ్చేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన బాధితుడు తల్లిదండ్రులు తమ కుమారుడిని ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉపాధికోసమని వెళ్లి చిక్కుల్లో పడ్డ తెలంగాణ కుర్రాడు.. 6 నెలలుగా దుబాయ్‌లోనే..
Gorre Rajendhar
Anand T
|

Updated on: Jul 23, 2025 | 11:57 AM

Share

నిర్మల్ జిల్లాలోని పరిమండల్ గ్రామానికి చెందిన గొర్రె రాజేంధర్ అనే యువకుడు 2023లో ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసిన తర్వాత స్థానిక ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అతని ఒక షాప్‌లో క్లీనర్‌గా పనిచేస్తూ నెలకు 1,000 దిర్హం (రూ. 23,470.) సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఒక సంవత్సరం తర్వాత, రాజేంధర్‌కు తెలియకుండానే అతని హౌస్‌ నంబర్‌తో లింక్‌చేయబడి ఉన్న బ్యాంకు అకౌంట్‌లోకి దాదాపు 2,000 దిర్హామ్‌లు ఇండియన్‌ కరెన్సీలో రూ. 46,941 బదిలీ చేయబడ్డాయి. దీని తర్వాత అతని యజమాని రాజేంధర్‌ను ఉద్యోగం తొలగించాడు. అయితే అతని ఖాతాలోకి అనధికారికంగా నిధులు జమకావడంతో స్థానిక పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

అయితే యజమమాని తనను ఉద్యోగంలోంచి తొలగించడంతో రాజేంధర్ భారతదేశానికి తిరిగి రావడానికి ప్రయత్నించాడు. కానీ విమానాశ్రయంలోని అతని బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన లావాదేవీల గురించి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు రాజేంధర్‌ను దేశం విడిచి వెళ్లేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో చేసేదేమి లేక రాజేందర్ అల్ ఖుసైస్‌లో ఉన్న తన స్నేహితులతో ఉంటూ.. తన సమస్యను పరిష్కరించచుకోవడానిక ప్రయత్నాలు మొదటు పెట్టాడు. ఇందులో భాగంగా క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్, భారత రాయబార కార్యాలయం చూట్టూ తిరుగుతూనే ఉన్నాడు.

తన పరిస్థితిని రాజేంధర్ తల్లిదండ్రులకు తెలియజేయడంతో వాళ్లు ఇటీవల నిర్మల్ జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసి, గల్ఫ్ వలసదారుల సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్ల నుండి సహాయం కోరాడు. తమ కొడుకును ఎలాగైనా తిరిగి రప్పించాలని వేడుకున్నారు. ఈ సమస్యను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD)తో సహా సంబంధిత రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పించిన ఆయన మాట్లాడుతూ సరైన ఉపాధి ఆఫర్లు లేకుండా ఎవరూ విదేశాలకు వెళ్లొద్దని సూచించారు. గల్ఫ్ వలసదారులు ఆన్‌లైన్ మోసాలు, సైబర్ మోసం మరియు క్రెడిట్ కార్డ్ దుర్వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.