AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వాగు దాటుతుండగా ఒక్కసారిగా పెరిగిన వరద.. ట్రాక్టర్‌తో సహా కొట్టుకుపోయిన రైతులు.. కాసేపటి తర్వాత..

మంచిర్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. రైతులు ట్రాక్టర్‌తో వాగు దాటుతున్న క్రమంలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ట్రాక్టర్‌లో సహాపై దానిపై ఉన్న నలుగురు రైతులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతదూరంగా వెళ్లాక ఒక చెట్టుకొమ్మ సహాయంతో ఒడ్డుకు చేశారు. ప్రాణాలతో బయటపడడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

Watch Video: వాగు దాటుతుండగా ఒక్కసారిగా పెరిగిన వరద.. ట్రాక్టర్‌తో సహా కొట్టుకుపోయిన రైతులు.. కాసేపటి తర్వాత..
Mancherial Floods
Naresh Gollana
| Edited By: Anand T|

Updated on: Jul 23, 2025 | 12:26 PM

Share

ఎగువన కురుస్తున్న వర్షాలకు మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగు ఉప్పొంగింది. వ్యవసాయ పనులకు ట్రాక్టర్ సాయంతో ఎర్రవాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా వరద ఉదృతి అమాంతం పెరగడంతో ట్రాక్టర్ వాగులో గల్లంతైంది. ఇదే సమయంలో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న నలుగురు వరదలో కొట్టుకుపోయారు. దాదాపు కిలో మీటర్ కొట్టుకుపోయిన భార్యభర్తలు,ఇద్దరు వ్యవసాయ కూలీలు చెట్టుకొమ్మ సాయంతో ఒడ్డు చేరారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగు ఉప్పొంగింది. భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ లో పత్తి చేనుకు మందు కొట్టడానికి కన్నెపల్లి మండలం జంగంపల్లి కి చెందిన బోరు కుంట రాజం తన భార్య , మరో ఇద్దరు కూలీలతో కలిసి ట్రాక్టర్ పై చేనుకు బయలుదేరారు. వర్షం పెరగడంతో చేనుకు వెళ్లిన రాజం ఇంటికి తిరుగు పయనమయ్యారు. వాగు వరద ఉదృతి అంతకంతకు పెరగుతుండటంతో తప్పని పరిస్థితిలో వర్షంలోనే వాగు దాటే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో వరద ఉదృతికి ట్రాక్టర్ తో సహా వాగులో కొట్టుకుపోయారు నలుగురు. పక్కనే చెట్టుకొమ్మను పట్టుకుని తృటిలో ప్రాణాలు కాపాడుకుని ఒడ్డుకు చేరారు.

అయితే ట్రాక్టర్ మాత్రం ఎర్రవాగులో కొట్టుకుపోయింది. భీమిలి మండలం చిన్న తిమ్మాపూర్ ఎర్రవాగుపై బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు దశాబ్దాలుగా కోరుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వరద ఉధృతితో వాగు దాటడం గ్రామీణ ప్రజలకు ప్రాణ సంఘటనగా మారింది. గతంలో వాగు దాటుతున్న క్రమంలో ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు వరదలు కొట్టుకుపోయాయని.. మరో ప్రమాదం జరగకముందే అదికారులు స్పందించాలని కోరుతున్నారు తిమ్మాపూర్ గ్రామస్తులు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.