AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పైకేమో బుద్దిమంతుడిలా పోజులు.. లోన చేసేది పోరంబోకు పనులు.. అసలు మ్యాటర్ తెలిస్తే

అమ్మాయి అనుకున్నారు.. తన ఇన్‌స్టా ఐడీకి మెసేజ్ చేసిందని తెగ సంబరపడిపోయారు. అయ్యో.! నాకు ఎవ్వరూ లేరు. కొంచెం డబ్బులు పంపండి అని అడిగింది. ఆమె చెప్పినట్టే డబ్బులు పంపేసరికి.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Telangana: పైకేమో బుద్దిమంతుడిలా పోజులు.. లోన చేసేది పోరంబోకు పనులు.. అసలు మ్యాటర్ తెలిస్తే
Khammam
N Narayana Rao
| Edited By: |

Updated on: Jul 23, 2025 | 12:59 PM

Share

అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో ఐడీలు క్రియేట్ చేసి తనకు ఎవరూ లేరు. అనాథను అంటూ.. చదువుకునేందుకు డబ్బులు కావాలంటూ వేరేవారి బ్యాంక్ అకౌంట్స్ పంపేవాడు. వాటికి తన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుని డబ్బులు తీసుకునే వాడు. పలువురిని మోసం చేసిన కేటుగాడు హరీష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం మద్దులపల్లికి చెందిన గడబోయిన హరీష్ అనే వ్యక్తి వాటర్ ప్లాంట్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అమ్మాయిల ఫోటోలతో ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి.. అమ్మాయిల గొంతులా మార్చి మాట్లాడుతూ యువకులను ఆకర్షించేవాడు. గడబోయిన హరీష్ ఇంటి దగ్గరే ఉంటూ టెంట్ హౌస్, మినిరల్ వాటర్ ప్లాంట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు గత కొంతకాలంగా అబ్బాయిలను టార్గెట్ చేసి ఫేక్ ఐడీలతో డబ్బులు సంపాదించడం ప్రధాన భృతిగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ట్రాలీ నడిపే యువకుడి మధు అకౌంట్ ఉపయోగించి డబ్బులు డిపాజిట్ చేయించుకునేవాడు. ఈ విషయం ఆ గ్రామానికి చెందిన ఓ అమ్మాయి బయట పెట్టడంతో హరీష్ గుట్టు రట్టయింది. పెద్ద మనుషులు పంచాయితీ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది.

కామేపల్లి మండలంలోని చుట్టుపక్క గ్రామాల్లో మొత్తం 216 మందిని మోసం చేసి సుమారు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. పరారీలో ఉన్న హరీష్ కోసం పోలీసులు గాలించి ఖమ్మంలో పట్టుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.కేటుగాడు మోసాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా