Watch: రాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్ చేసిన పనితో చావు తప్పిందంటూ..
ప్రస్తుతం రవాణా వ్యవస్థ బాగా విస్తరించింది. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే, బస్సు, రైలు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి యాప్ ఆధారిత రవాణా సౌకర్యాలు ప్రజలకు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. సొంత వాహనాలు లేని వారు, డ్రైవింగ్ రాని వారు, బస్ స్టాపులు, రైల్వే స్టేషన్‌లకు దూరంగా ఉన్న వారు.. త్వరగా, సౌకర్యవంతంగా ప్రయాణం చేయడం కోసం ర్యాపిడో , ఉబర్ వంటి రైడింగ్ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇందులో బైక్, ఆటో, కార్ సర్వీసులు సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇక ఈ వాహనాలు నడిపించే డ్రైవర్ల పనితీరుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో దేశరాజధాని ఢిల్లీకి సంబంధించినదిగా తెలిసింది. ఢిల్లీ వీధుల్లో రాపిడో బైక్ రైడ్ చేస్తున్నప్పుడు ఒక యువతి తన దృశ్యాలను రికార్డ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు బైక్ తో పాటు రోడ్డుపై పడిపోయింది. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 1.2 మిలియన్లకు పైగా ఈ వీడియోని వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ప్రియాంక కూడా ఈ వీడియోను షేర్ చేసి తనకు జరిగిన భయానక అనుభవాన్ని నెటిజన్లతో షేర్ చేసుకుంది.
తాను ప్రయాణిస్తున్న రాపిడో బైక్ డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో ఈ వీడియోలో తెలియజేసింది. డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని, తనకు హెల్మెట్ ఇవ్వలేదని ప్రియాంక చెప్పింది. అతను బైక్‌ను ఎక్కువ సార్లు కుదుపులకు గురి చేస్తూ.. రాంగ్ రూట్‌లో నడుపుతున్నాడని చెప్పింది. ఇంతలో, ఒక మలుపు వద్ద రాపిడో బైక్ ముందు వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొట్టింది. దాంతో వారిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇదంతా ఢిల్లీ పోలీసు వాహనం ముందు జరిగింది. అయితే, పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదని వాపోయింది. దీంతో భయపడిపోయిన ప్రియాంక డ్రైవర్‌కు డబ్బు చెల్లించి తన రైడ్ కంప్లీట్ చేశానని చెప్పింది.
రాపిడో… ఒకప్పుడు దీనిపై ఎక్కువ నమ్మకం ఉంచానని చెప్పింది. కానీ, ఇలాంటి డ్రైవర్ల కారణంగా ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది. రాపిడో రైడ్ సమయంలో నేను ఇంతలా భయపడింది ఇదే మొదటిసారి అని ప్రియాంక రాసింది. అయితే, ఈ సంఘటనపై రాపిడో స్పందిస్తూ, మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించినందుకు ధన్యవాదాలు. మీ అభ్యర్థన మేరకు మేము రైడర్‌పై ఎటువంటి చర్య తీసుకోలేదు. భవిష్యత్తులో ఏదైనా సమస్య ఎదురైతే దయచేసి మమ్మల్ని సంప్రదించండి అని వ్యాఖ్యలో రాసింది.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఈ వీడియోపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒక వినియోగదారుడు అందుకే హెల్మెట్లు తప్పనిసరి అని రాశారు. మరొకరు “భయానక విషయం ఏమిటంటే ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




