AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ ఇదేం లొల్లిరా సామీ..! పెళ్లి విందులో మటన్‌ ముక్కలు పడలేదని..కూర్చీలు, బెంచీలతో కొట్టుకున్న బంధువులు

వైరల్‌ వీడియోలో స్త్రీలు ఒకవైపు తింటుంటే పురుషులు మరోవైపు తింటున్నారు. ఒక టేబుల్ వద్ద 14 నుంచి15 మంది పురుషులు భోజనం చేస్తున్నారు. వారు తింటున్న టేబుల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చే ముందు వరకు అంతా బాగానే ఉంది. అతడు వారి టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాతే అసలు సీన్‌ మొదలైంది... తెల్లటి

వార్నీ ఇదేం లొల్లిరా సామీ..! పెళ్లి విందులో మటన్‌ ముక్కలు పడలేదని..కూర్చీలు, బెంచీలతో కొట్టుకున్న బంధువులు
Marriage
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2023 | 10:19 PM

Share

వివాహ వేడుకలో ఏర్పాటు చేసిన విందు సందర్బంగా ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ హింసాత్మక వాగ్వాదానికి దిగిన ఓ విచిత్రమైన సంఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆగస్ట్ 24, 2023న తీసిన ఈ క్లిప్‌లో ఒక వ్యక్తి తన బిర్యానీలో సరిపడా మటన్ ముక్కలు పడలేదని వాగ్వాదానికి దిగిన ఘటన తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ కొట్టుకోవటం ఇంటర్‌నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మైక్రోబ్లాగింగ్ సైట్ X, గతంలో ట్విట్టర్‌లో ఈ వీడియోని షేర్‌ చేశారు. వైరల్‌ అవుతున్న వీడియోలో వైట్ కర్టెన్‌లతో ఏర్పాటు చేసిన వివాహ డైనింగ్ హాల్‌లో వివాహ అతిథులు విందు చేస్తుండటం తెలుస్తుంది.

వైరల్‌ వీడియోలో స్త్రీలు ఒకవైపు తింటుంటే పురుషులు మరోవైపు తింటున్నారు. ఒక టేబుల్ వద్ద 14 నుంచి15 మంది పురుషులు భోజనం చేస్తున్నారు. వారు తింటున్న టేబుల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చే ముందు వరకు అంతా బాగానే ఉంది. అతడు వారి టేబుల్ దగ్గరికి వచ్చిన తర్వాతే అసలు సీన్‌ మొదలైంది… తెల్లటి షర్ట్‌ వేసుకున్న ఓ వ్యక్తి.. కూర్చుని భోజనం చేస్తున్న వ్యక్తి తలపై కొట్టాడు.. దాంతో అతడి టోపీ కిందపడిపోతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య వాదన జరిగింది..ఇంతలో మరో వ్యక్తి అక్కడికి చేరుకున్నాడు.. అంతలోనే కూర్చుని భోజనం చేస్తున్న అందరూ లేచారు.. కూర్చీలు చేతుల్లోకి తీసుకుని ఒకరిపై ఒకరు విసురుకుంటూ కొట్టుకోవటం మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు కుర్చీలు, బల్లలు విసురుకుంటూ పెద్ద యుద్ధమే క్రియేట్‌ చేశారు.

ఆరు నిమిషాల క్లిప్‌లో అతిథులు ఒక టేబుల్ చుట్టూ కూర్చుని, పెళ్లిలో తమ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే, తన బిర్యానీలో తగినంత మటన్ ముక్కలు లేవనే విషయంలో వారి మధ్య వాదన జరిగినట్టుగా తెలిసింది. దాంతో అతిథులు ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించడంతో పెళ్లి మండపం కాస్త యుద్ధభూమిగా మారుతుంది.. కొద్దిసేపటికే, అక్కడున్న వారంతా ఆ గొడవలోకి దూరిపోయారు. కొంతమంది మహిళలు వారి పోరాటాన్ని ఆపడానికి ప్రయత్నించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఎవరూ వారి మాటను లెక్కచేయటం లేదు.

X యూజర్ ఘర్ కే కాలేష్ వీడియోను షేర్ చేశారు. పాకిస్తాన్‌లో వివాహ వేడుకలో బిర్యానీలో మటన్ ముక్కలు రాలేదని కోపంతో వారంతా కోట్లాటకు దిగినట్టుగా రాశారు. ఆన్‌లైన్‌లో షేర్ చేసిన ఈ వీడియో వేలకొద్దీ లైక్‌లతో 368.7K వీక్షణలను పొందింది. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వీడియోపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..