Viral Video: తాళికట్టిన వెంటనే రెచ్చిపోయిన వధువు..! పాపం.. పెళ్లికొడుకు ఏం చేశాడో చూడాల్సిందే..
కొందరు కొత్త జంట పెళ్లి సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎదుటి వారు కలలో కూడా ఊహించని పనులు చేస్తుంటారు. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లి వేడుకలు అంటేనే ఎటు చూసినా హడావుడి కనిపిస్తుంది. ఇకపోతే, పెళ్లిలో వరమాల తంతు మరింత ప్రత్యేకం. ఇది అతి ముఖ్యమైన సందర్భం. పెళ్లికి ఆహ్వానించబడిన ప్రతి అతిథి ఖచ్చితంగా వరమాల వేడుకను చూసి ఆనందిస్తారు. సంతోషంగా ఆ నవ దంపతులను ఆశీర్వాదిస్తారు. అలాగే, ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వధూవరులు చేసే ప్రతి పనిని గమనిస్తారు. అటువంటి పరిస్థితిలో పెళ్లి పీటలపై కూర్చుని ఉన్న వధూవరులిద్దరూ తమ గౌరవాన్ని కాపాడుకునే విధంగా ప్రవర్తిస్తారు. కానీ, కొందరు కొత్త జంట పెళ్లి సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఎదుటి వారు కలలో కూడా ఊహించని పనులు చేస్తుంటారు. అలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో దేబాసిష్ స్వైన్ షేర్ చేసిన ఈ వీడియోలో కొత్త జంట పెళ్లి జరిగింది. వరమాల వేడుక ముగిసింది. ఆ తర్వాత వేదికపై ఉన్న నూతన దంపతులు పెళ్లికి వచ్చిన బంధుమిత్రులను సంతోషంగా పలకరిస్తున్నారు. అందరితో కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వేదిక పైకి వచ్చిన వరుడి స్నేహితులు వారిని డ్యాన్స్ చేయాలంటూ పట్టుబట్టారు. అంతే…వధువు క్షణం కూడా ఆలస్యం చేయకుండా డ్యాన్స్ చేయటం మొదలుపెట్టేసింది. కాళ్లు, చేతులు ఊపేస్తూ డ్యాన్స్ చేస్తూనే ఉంది. వరుడు మాత్రం సిగ్గుతో వెనక్కి జరిగిపోతున్నాడు. స్నేహితులు ఎంత చెప్పినా కాలు కూడా కదపటం లేదు.. కానీ, స్టేజ్‌పై పెళ్లి కూతురు చేసిన విచిత్రమైన డ్యాన్స్ స్టెప్పులు మాత్రం అందరినీ అదరగొట్టేశాయి. వరుడికి ఇవన్నీ అస్సలు నచ్చవు, అతను ఆమెను అలా చూస్తూనే ఉంటాడు. ఆ టైమ్‌లో వరుడి ముఖం ఎలా మారిపోయిందో వీడియోలో చూడాల్సిందే..
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
కాగా, ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వీడియోపై చాలా మంది ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వధువు చాలా సంతోషంగా ఉందని, ఆమె ఏ ఐటమ్ సాంగ్‌లో డ్యాన్స్ చేయడం లేదు.. తన పెళ్లిలో తను సంతోషంగా డ్యాన్స్ చేస్తుందంటూ ఆమెను కొందరు ప్రశంసిస్తూ కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..