‘హై-రిస్క్‌ ఫుడ్‌’ కేటగిరీలో మినరల్‌ వాటర్‌

‘హై-రిస్క్‌ ఫుడ్‌’ కేటగిరీలో మినరల్‌ వాటర్‌

Phani CH

|

Updated on: Dec 10, 2024 | 10:14 AM

ప్లాస్టిక్ బాటిల్స్​లో నీళ్లు తాగితే.. పలు ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. మినరల్‌ వాటర్‌ ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపిస్తుందనడంలో సందేహం లేదు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్​లో నీళ్లు తాగడంపై కొలంబియా యూనివర్సిటికీ చెందిన పరిశోధనా బృందం అధ్యయనం చేసింది. వాటర్​బాటిల్‌లోని కణాలను గుర్తించడానికి న్యూ ఇమేజింగ్ టెక్నిక్​ను పరిశోధకులు వాడారు.

దీనిలో షాకింగ్ విషయాలను వాళ్లు గుర్తించారు. సగటున లీటర్ వాటర్​కు 2,40,000 ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. వాటిలో 90 శాతం నానో ప్లాస్టిక్​లేనట. ఈ నీటిని తీసుకోవడం వల్ల కణాలు, కణాజాలలోకి ప్లాస్టిక్‌ ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయట. తాగునీటి ద్వారా వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్లాస్టిక్‌ క్యాన్స్‌, బాటిల్స్‌లో అమ్మే ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌, మినరల్‌ వాటర్‌ను ‘హై-రిస్క్‌ ఫుడ్‌’ క్యాటగిరీలో చేర్చింది. మినరల్‌ వాటర్‌ను తయారుచేసే కంపెనీలకు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సర్టిఫికెట్‌ తప్పనిసరి కాదంటూ గత అక్టోబర్‌లో కేంద్రప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

50% తక్కువ ధరకే రైల్వే టిక్కెట్లా ?? రైల్వే మంత్రి మాటల్లో వాస్తవమేంటి ??

పేరెంట్స్‌ని పెళ్లి రోజే ఖతం చేసి.. కథలు అల్లాడు

ఓటీటీలు ప్రతీనెల డబ్బులు కట్‌ చేస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి !!

వరదలో వినోదం.. మనవళ్లతో కలిసి తాత ఎంజాయ్ !!

చికెన్‌ 65.. వరల్డ్‌ వంటకాల్లో థర్డ్‌ ప్లేస్‌