వామ్మో.. ఒంగోలులో దెయ్యమట !! జుట్టు విరబోసుకుని.. ఏడుస్తూ..
అర్దరాత్రి… చిమ్మ చీకటి… నగరానికి దూరంగా ఓ ముగ్గురు యువకులు మద్యం మత్తులో జోగుతూ బైక్‌పై వెళుతున్నారు… మద్యం మత్తు చాలదన్నట్టు అంతకు మించి మత్తిచ్చే మత్తుపదార్ధాల కోసం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వచ్చారు… ఎప్పుడూ లేని విధంగా ఓ భయంకరమైన అనుభవం వారికి ఎదురైంది… హఠాత్తుగా జుట్టు విరబోసుకుని, భయంకరంగా ఉన్న రూపంతో ఓ స్త్రీ వీరి బైక్‌కు ఎదురొచ్చింది…
రౌద్రంగా చూస్తూ, ఏడుస్తూ, కేకలు వేస్తూ… రా… రావాలయ్యా… నువు కావాలయ్యా… రా, రా… అంటూ పెడబొబ్బలు పెట్టింది… ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన ఆ యువకులు భయపడుతూనే బైక్ హెడ్‌లైట్ వెలుతురులో ఫోటోలు తీశారట… వీడియో రికార్డింగ్ చేశారట… సర్కులేట్ అవుతున్న ఫోటోలు అంత స్పష్టంగా లేవు… అయితే ఆ ఫోటోలు చూస్తే ఎవరైనా జడుసుకుని చావాల్సిందే… ఆ ఫోటోలు రాంగోపాలవర్మ దెయ్యం సినిమాలో కన్నా భయంకరంగా ఉన్నాయి… వీడియో మాత్రం లైటింగ్ లేక చీకటిగా ఉంది కానీ, ఆ స్త్రీ ఏడుపులు, పెడబొబ్బలతో సృష్టించిన బీభత్సం మాత్రం రికార్డయింది. తనంటే భయం లేకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్న ఆ ముగ్గురు యువకులపై ఆ స్త్రీ ఒక్క ఉదుటున వారిపై లంఘించిందట… ఓ యువకుడి చేతిని, కాళ్ళను కండలు ఊడేలా కోరికేసిందట… దీంతో దెబ్బకు మత్తు దిగిపోయి ఆ యువకులు తమను దెయ్యం వెంటాడిందని భావించి ప్రాణభయంతో పరుగులు పెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

