AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేరెంట్స్‌ని పెళ్లి రోజే ఖతం చేసి.. కథలు అల్లాడు

పేరెంట్స్‌ని పెళ్లి రోజే ఖతం చేసి.. కథలు అల్లాడు

Phani CH
|

Updated on: Dec 09, 2024 | 9:50 PM

Share

రోజు మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లాడు అతడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి ఊహించని షాకింగ్‌ సీన్‌ అతని కంట పడింది. ఇంట్లో కుటుంబం అంతా రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉండటం చూసి అతని గుండె బద్దలైంది. ఎవరు చేశారో.. ఎలా జరిగిందో తెలియక.. ఒక్క క్షణం అతని గుండె ఆగినంత పనైంది. తేరుకుని పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు పరుగుపరుగున వచ్చారు.

అక్కడి సీన్‌ చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంలో ట్రిపుల్‌ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దారున ఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. అయితే తల్లిదండ్రులతో పెద్దగా సత్సంబంధాలు లేని తనయుడే వారిద్దరినీ సరిగ్గా వారి పెళ్లిరోజే హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. తనకంటే కూడా సోదరిపైనే వారిద్దరూ ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని కక్ష పెంచుకుని ఇంత ఘాతుకానికి ఒడిగట్టడం సంచలనం సృష్టించింది. తాను మార్నింగ్‌ వాక్‌కు వెళ్లొచ్చేలోపు తండ్రి రాజేష్‌ కుమార్‌, తల్లి కోమల్‌, సోదరి కవిత రక్తపు మడుగులో పడి ఉన్నారని నిందితుడు అర్జున్‌ తొలుత కన్నీరుమున్నీరుగా విలపించాడు. బుధవారం తన తల్లిదండ్రుల 27వ వివాహ వార్షికోత్సవం ఉందని.. వేడుక చేసుకుందామనుకునేలోపు ఈ దారుణం చోటుచేసుకుందని, ఇక తాను ఎవరికోసం బతకాలంటూ ఇరుగుపొరుగువారి ముందు పెద్దపెట్టున ఏడ్చాడు. సమాచారాన్ని తానే పోలీసులకు తెలిపాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓటీటీలు ప్రతీనెల డబ్బులు కట్‌ చేస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి !!

వరదలో వినోదం.. మనవళ్లతో కలిసి తాత ఎంజాయ్ !!

చికెన్‌ 65.. వరల్డ్‌ వంటకాల్లో థర్డ్‌ ప్లేస్‌

రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!

వెజిటేరియన్స్‌కి సూపర్‌ ఫుడ్స్‌ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్‌