రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!

రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!

Phani CH

|

Updated on: Dec 09, 2024 | 9:37 PM

గతంలో సిటీల్లోకి వెళ్తేనే బిర్యానీ దొరికే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లోనూ నోరూరించే బిర్యానీలు అందుబాటులో ఉంటున్నాయి. సరసమైన ధరలకే రకరకాల బిర్యానీలను అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం చికెన్ ధర ఎక్కువగా ఉంది.. ఈ సమయంలో.. అతి తక్కువ ధరకే చికెన్ బిర్యాని ఇస్తుంటే.. చికెన్‌ ప్రియులు ఊరికే ఉంటారా.. ఎగబడిపోరూ.. తాజాగా ఇదే జరిగింది..

కొత్త సినిమా రిలీజ్ అయితే టికెట్స్ కోసం ఎలా ఎగబడతారో..ఇక్కడ బిర్యాని కోసం అలాగే ఎగబడ్డారు. అందుకు కారణం 50 రూపాయలకే బిర్యానీ అందించడం. కేవలం 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అని ఒక హోటల్ యజమాని ప్రకటించడంతో, ఆ హోటల్ ముందు బిర్యాని ప్రియులు బారులు తీరారు. వాళ్లంతా బిర్యానీ కోసం ఎగబడటంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంలోని భగత్ సింగ్ సెంటర్లో ఓ హోటల్‌ను కొత్తగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్యానీ ప్రియులకు నాయుడు హోటల్ యాజమాన్యం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 50 రూపాయలకే చికెన్ బిర్యానీ అంటూ ఆఫర్ ఇచ్చారు. అలా చెప్పారో లేదో..ఇంకేముంది..పిల్లా పాపలను..ఎత్తుకొని మరీ తమ వంతు వచ్చేదాకా క్యూలైన్‌లో నిల్చున్నారు చాలామంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వెజిటేరియన్స్‌కి సూపర్‌ ఫుడ్స్‌ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్‌

భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!

అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్‌ ??