భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!

భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!

Phani CH

|

Updated on: Dec 09, 2024 | 9:19 PM

మహారాష్ట్రలోని పుణె సిటీలోగల సోమవార్ పేట్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. నానబెట్టిన శనగలు తినడానికి నిరాకరించిన భర్తపై భార్య విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎలాగో భార్య బారినుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు ఆ బాధిత భర్త. భర్తను బండబూతులు తిడుతూ కర్రతో కొట్టింది. మిక్సీ జార్‌తో తలపై బాధింది. అతడి చేతి వేలిని కొరికేసింది.

ముఖంపై గోళ్లలో గీరేసింది. ఎడమ చెవి వెనుక భాగంలో రక్తం వచ్చేలా రక్కింది. సోమవార్‌ పేట్‌లోని త్రిశుండ గణపతి ఆలయం సమీపంలోని ఓ ఇంట్లో భార్యభర్తలు నివసిస్తున్నారు. ఈ నెల 1న రాత్రి నానబెట్టిన శనగల విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. నానబెట్టిన శనగలు తీసుకొచ్చి తినమని భర్తకు అందించింది భార్య. అందుకు అతను తనకు ఇష్టం లేదని తిననని చెప్పాడు. దాంతో ఆగ్రహించిన భార్య అతడితో గొడవపడింది. భర్త ఎదురుతిరగడంతో సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. భర్త ఆ సుత్తిని లాక్కోవడంతో మిక్సీ జార్‌ అందుకొని అతని తలపై కొట్టింది. ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు చేతులు అడ్డం పెట్టుకోవడంతో వేలు కొరికేసింది. ఆపై కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. ఎలాగోలా భార్య బారి నుంచి తప్పించుకున్న భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్‌ ??