వెజిటేరియన్స్‌కి సూపర్‌ ఫుడ్స్‌ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్‌

వెజిటేరియన్స్‌కి సూపర్‌ ఫుడ్స్‌ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్‌

Phani CH

|

Updated on: Dec 09, 2024 | 9:34 PM

మ‌న శ‌రీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తినాల‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. పోష‌కాల విష‌యానికి వ‌స్తే మ‌న‌కు రెండు ర‌కాల పోష‌కాలు అవ‌స‌రం అవుతాయి. ఒక‌టి స్థూల పోష‌కాలు. పిండి ప‌దార్థాలు, ప్రోటీన్లు, కొవ్వుల‌ను స్థూల పోష‌కాలు అంటారు. ఇవి మ‌న‌కు ఎక్కువ శాతం అవ‌స‌రం అవుతాయి. విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌. వీటిని సూక్ష్మ పోష‌కాలు అంటారు.

ఇవి మ‌న‌కు త‌క్కువ‌గా అవ‌స‌రం అవుతాయి. అయితే చాలా మంది నిత్యం పిండి ప‌దార్థాలు, కొవ్వుల‌ను తింటుంటారు. కానీ ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోరు. ప్రోటీన్లు అంటే చాలా మంది కేవ‌లం నాన్ వెజ్ ఆహారాల్లోనే ఉంటాయి అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప‌లు వెజ్ ఆహారాల్లోనూ ప్రోటీన్లు ఉంటాయి. ఇక ప్రోటీన్లు ఉండే వెజ్ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రోటీన్ల వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ప్రోటీన్లు మ‌న శ‌రీరానికి శ‌క్తిని అందిస్తాయి. కండ‌రాల‌ను నిర్మాణం చేస్తాయి. అలాగే బ‌రువును నియంత్రణ‌లో ఉంచుతాయి. పనీర్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. 100 గ్రాముల ప‌నీర్ నుంచి మ‌న‌కు సుమారుగా 18 నుంచి 20 గ్రాముల మేర ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల వెజిటేరియ‌న్లు ప‌నీర్‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌చ్చు. దీంతో ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ప‌ప్పు దినుసుల‌ను కొంద‌రు పక్కన పెడుతుంటారు. కానీ ఇవి ప్రోటీన్లకు అద్భుత‌మైన నిల‌యం అని చెప్పవ‌చ్చు. 100 గ్రాముల ప‌ప్పు దినుసుల‌ను తిన‌డం వ‌ల్ల సుమారుగా 7 నుంచి 9 గ్రాముల మేర ప్రోటీన్లు ల‌భిస్తాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!

అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్‌ ??