చికెన్ 65.. వరల్డ్ వంటకాల్లో థర్డ్ ప్లేస్
చికెన్ 65.. ఈ వంటకానికి ఉండే క్రేజ్ అదో లేవెల్.. చికెన్ 65ని నాన్‌వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. పార్టీ ఏదైనా నాన్‌వెజ్ ఐటమ్స్‌లో చికెన్ 65 ఉండాల్సిందే. కంటికి, పంటికి ఇంపుగా ఉండే చికెన్ 65.. ఇప్పుడు మరో ఘనత సాధించింది. దేశంలో ముఖ్యంగా తమిళనాడులో కనిపెట్టిన చికెన్ 65, నేడు ప్రపంచంలో కోడిమాంసం వంటకాల్లో మూడో స్థానంలో నిలిచింది.
ప్రపంచ స్థాయిలో ప్రతి ఏడాది ప్రజలు ఇష్టంగా స్వీకరించే ఆహార పదార్ధాల వివరాలు సేకరించి, వాటి జాబితాను టెస్ట్ అట్లాస్ అనే సంస్థ విడుదల చేస్తోంది. ఈ జాబితాలో తమిళనాడులో తయారవుతున్న చికెన్ 65 మూడో స్థానంలో నిలిచింది. 1960లో బుఖారీ అనే ఆహార సంస్థ ఈ చికెన్ 65 తయారీ ప్రారంభించినట్లు చెబుతుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో తయారయ్యే చికెన్ 65 రుచి, నాణ్యత పరిశీలించిన సంస్థ నిర్వాహకులు, మూడో స్థానాన్ని కేటాయించారు. ఈ జాబితాలో చైనాకు చెందిన క్రిస్పీ ఫ్రైడ్ చికెన్, తైవాన్‌కు చెందిన బాంబూకాన్ చికెన్ తదితరాలు కూడా చోటుచేసుకున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.50 కే వేడి వేడి బిర్యానీ.. కట్ చేస్తే ఇదీ సీన్ !!
వెజిటేరియన్స్‌కి సూపర్ ఫుడ్స్ ఇవి !! శాఖాహారంలోనూ అద్భుతమైన ప్రొటీన్
భర్తను చితకబాదిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు !!
అయ్యో దేవుడా !! పెళ్లి భోజనంలో మిరపకాయల హల్వా.. అతిథుల రియాక్షన్ ??