AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నదిని దాటడానికి ఈ వ్యక్తి వాడిన టెక్నిక్ చూస్తే… మీరు కూడా క్లాప్స్ కొడతారు

'నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అన్న కొటేషన్ చాాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. ఇది నూటికి నూరు శాతం నిజమని తాజాగా వైరలవుతున్న...

Viral Video:  నదిని దాటడానికి ఈ వ్యక్తి వాడిన టెక్నిక్ చూస్తే... మీరు కూడా క్లాప్స్ కొడతారు
Viral Video
Ram Naramaneni
|

Updated on: Jul 23, 2021 | 9:00 PM

Share

‘నీడ్ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అన్న కొటేషన్ చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది. ఇది నూటికి నూరు శాతం నిజమని తాజాగా వైరలవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ క్రేజీ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. తాజాగా దేశంలో విస్తారంగా వర్షాలు కురిస్తున్న విషయం తెలిసిందే. భారీ వానలకు వాగులు, వంగలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మరికొన్ని కుగ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తాజాగా వైరలవుతున్న వీడియోలో ఓ వ్యక్తి నది దాటేందుకు ఓ వినూత్నమైన టెక్నిక్ ఉపయోగించాడు. ఈ వీడియో మిమ్మల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

వీడియో వీక్షించండి…

వీడియోలో ఉన్న వ్యక్తి  వినూత్నమైన ఆవిష్కరణతో ముందుకొచ్చాడు. అతను నదికి ఇరువైపులా రెండు తాడులను సమాంతరంగా కట్టాడు. అతను ఈ తాడులపై చెక్క సీటును అటాచ్ చేశాడు. ఆపై చేతులతో తిప్పితే ఆ సీటు ముందుకు కదిలే విధంగా రింగులను ఏర్పాటు చేశాడు. అనంతరం ఆ సీటుపై కూర్చుని, రింగులను తిప్పుతూ హాయిగా నది అవతలి వైపు కూడా వెళ్లాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. వాటే ఇన్నోవేషన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ వీడియోను రూపీన్ శర్మ ఐపిఎస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Also Read: ఎంసెట్, నీట్, ఐఐటీ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్…

Big News Big Debate: దళితుల చుట్టూ తెలంగాణ రాజకీయం… వీడియో