భార్యకు మాంసం షాప్ ఓనర్ డిస్కౌంట్ ఇచ్చాడని.. భర్త ఏం చేశాడంటే..?
తన భార్యకు మాంసం షాప్ యజమాని డిస్కౌంట్ ఇవ్వడం చూసి, వారికి అక్రమ సంబంధం ఉందని భర్త అనుమానించాడు. ఈ క్రమంలో కోపంతో తన భార్యపై కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో జావోకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కోర్టులో ఆమె చెప్పిన విషయాలకు అంతా అవాక్కయ్యారు. చివరకు ఏం తీర్పు ఇచ్చిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అనుమానం పెనుభూతం అంటారు. చిన్న డౌట్ కూడా ప్రాణాలను తీస్తుంది. అందుకే అనుమానించే ముందు పక్కాగా అన్నీ విషయాలు తెలుసుకోవాలి. ఇటీవలే ఉత్తర చైనాలో జరిగిన ఓ ఘటన ఇటువంటి ఘటనలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఓ మహిళ మాంసం కొనడానికి వెళ్లగా షాప్ యజమాని ఆమెకు డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడే భర్తకు అనుమానం వచ్చింది. అసలు తన భార్యకు షాప్ యజమాని ఎందుకు డిస్కౌంట్ ఇచ్చాడనే అనుమానం కోపోద్రిక్తుడై భార్యపై తీవ్రంగా దాడికి పాల్పడ్డాడు.
జిలిన్‌లోని సాంగ్యువాన్ జిల్లాకు చెందిన జూ అనే వ్యక్తి మార్చిలో తన భార్య జావోపై కత్తితో దాడి చేశాడు. స్థానిక మాంసం షాప్ నిర్వాహకుడు తన భార్యకు డిస్కౌంట్ ఇవ్వడాన్ని చూసి.. ఆమెకు అతనితో అక్రమ సంబంధం ఉందని జూ పొరపాటుగా అనుమానించాడు. దీంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో జావోకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కోర్టు సైతం నిందితుడిని దోషిగా తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్లు నిర్ధారించింది.
ఇదే సమయంలో జావో ఎంట్రీ వచ్చి.. తన భర్తను క్షమించాలని కోరింది. తీవ్రమైన శిక్ష వేయొద్దని చెప్పింది. ‘‘30ఏళ్ల మా బంధంలో జూ ఎప్పుడు తప్పు చేయలేదు. మేం చాలా సంతోషంగా ఉన్నాం. బిడ్డల భవిష్యత్తు కోసం ఈ సమస్యను సాగదీయడం ఇష్టం లేదని కోర్టుకు తెలిపింది. దాడి తీవ్రతను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితుడికి 10 ఏళ్ల 6నెలల జైలు శిక్ష వేసింది. ఒక చిన్న డిస్కౌంట్ వల్ల వచ్చిన అనుమానం ఏకంగా ఓ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. భార్య ప్రాణాల మీదకు వస్తే భర్త జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
