AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యో పాపం..సెక్యూరిటీ గార్డును ఎలా కొడుతుందో చూడండి… మర్లబడి మడతేస్తే ఏంటి సంగతి

కొంతమంది వ్యక్తులు వారి పనిమనుషుల మీద, సెక్యూరిటీ గార్డుల మీద మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటారు. వారి పేదరికాన్ని అలుసుగా చేసుకుని విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. నోయిడాలో తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి...

Viral Video: అయ్యో పాపం..సెక్యూరిటీ గార్డును ఎలా కొడుతుందో చూడండి... మర్లబడి మడతేస్తే ఏంటి సంగతి
Woman Attack On Security Gu
K Sammaiah
|

Updated on: Oct 21, 2025 | 4:26 PM

Share

కొంతమంది వ్యక్తులు వారి పనిమనుషుల మీద, సెక్యూరిటీ గార్డుల మీద మానవత్వం మరిచి ప్రవర్తిస్తుంటారు. వారి పేదరికాన్ని అలుసుగా చేసుకుని విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుంటారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. నోయిడాలో తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గ్రేటర్ నోయిడాలోని ప్రెసిథమ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసినందుకు అంజు శర్మ అనే మహిళపై కేసు నమోదు చేయబడింది. శనివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన సిసిటివిలో రికార్డ్‌ కావడంతో అది వైరల్‌గా మారింది.

వీడియో చూడండి:

వీడియోలో ఎరుపు చీరలో ఉన్న ఒక మహిళ నీలిరంగు యూనిఫాం ధరించిన సెక్యూరిటీ గార్డును పదే పదే చెంపదెబ్బ కొట్టడం, శారీరకంగా దాడి చేయడం చూడవచ్చు. ఆ మహిళ దూకుడు మీద ఉంది. ఒక సమయంలో ఆమె గార్డును పట్టుకుని నేలపైకి లాగుతుంది. జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే మరొక మహిళ సంఘటన స్థలంలో ఉంది.దాడి తర్వాత పోలీసులకు సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల కథనం ప్రకారం బాధితుడు ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ నివాసి అయిన రాజ్‌కుమార్ యాదవ్ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. గత నెల రోజులుగా యమునా అథారిటీ ప్రాంతంలోని సెక్టార్ 25లోని ప్రెసిథమ్ సొసైటీలోని టవర్ 7లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను విధుల్లో ఉన్నప్పుడు, సొసైటీ నివాసి అంజు శర్మ గేటు వద్దకు వచ్చి గొడవ ప్రారంభించి, తనపై శారీరకంగా దాడి చేసిందని యాదవ్ చెప్పాడు.

శర్మ తనను సొసైటీ ప్రాంగణం నుండి బయటకు లాగి దాడి చేసింది. పక్కనే ఉన్నవారు జోక్యం చేసుకుని సర్దిచెప్పినా కొట్టడం మాత్రం ఆపలేదని అతను ఆరోపించాడు. సంఘటన స్థలంలో ఉన్న సాక్షులు మహిళను ఆపడానికి ప్రయత్నించారని, కానీ ఆమె వారితో కూడా దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు. ఈ ఘర్షణ మొత్తం సొసైటీ సిసిటివి కెమెరాలలో రికార్డైంది.

సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు ఆధారంగా అంజు శర్మపై కేసు నమోదు చేసినట్లు డంకౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) మునేంద్ర సింగ్ ధృవీకరించారు. “కేసు నమోదు చేశాం. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని సింగ్ అన్నారు. అధికారులు సిసిటివి ఫుటేజ్‌ అధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత చట్టంలోని తగిన సెక్షన్‌లను ప్రయోగిస్తామని పోలీసులు తెలిపారు.