Viral Video: దీపావళి నాడు ఆకాశం నుంచి హైదరాబాద్ ఇలా… అరుదైన వీడియో షేర్ చేసిన వ్యోమగామి శుక్లా
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఓ అరుదైన వీడియోను షేర్ చేశారు. దీపావళి పండగను పురస్కరించుకుని సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గత దీపావళి సందర్భంగా అంతరిక్షం నుంచి తాను తీసిన వీడియో సోషల్ మీడియాలో...

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఓ అరుదైన వీడియోను షేర్ చేశారు. దీపావళి పండగను పురస్కరించుకుని సోషల్ మీడియాలో పంచుకున్న ఈ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. గత దీపావళి సందర్భంగా అంతరిక్షం నుంచి తాను తీసిన వీడియో X లో పోస్టు చేశారు శుభాంశు. ఈ ఏడాది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపారు శుభాంశు శుక్లా.
రాత్రివేళలో అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో వీడియో తీసిన దృశ్యాలు షేర్ చేయడం ద్వారా దేశ వాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. “ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసి మీరు నవ్వకుండా ఉండలేరు” అని X లో పోస్టు చేశారు. ఇది భూమిపై దీపావళి మాత్రమే కాదని, భూమి దీపావళి అని ఆయన పేర్కొన్నారు.
తన పోస్ట్‌లో, “షుక్స్” అని ఆప్యాయంగా పిలువబడే శుక్లా, ఈ దృశ్యాన్ని కవితాత్మకంగా ఇలా వర్ణించాడు: “సూర్యకాంతిగల నైరుతి నుండి పొగమంచు ఈశాన్యానికి – అంతరిక్షం నుండి భారతదేశంపై ఎగురుతూ ఉండటం చూడటం లాంటిది.” అని పేర్కొన్నారు.
తన 18 రోజుల కక్ష్య మిషన్‌లో, దేశం ప్రకాశించడం భూమికి వందల కిలోమీటర్ల ఎత్తు నుండి కూడా ప్రత్యేకంగా ఉందని వ్యోమగామి చెప్పాడు. “ద్వీపకల్పం ఒక రత్నంలా ప్రకాశిస్తుంది,” అని ఆయన రాశారు, “పుణే మెరుస్తుంది; బెంగళూరు మరియు హైదరాబాద్ మానవ చేతులతో గీసిన నక్షత్రరాశుల వలె మెరుస్తాయి.” అని చెప్పారు.
వీడియో చూడండి:
Flying over India from space — from the sunlit southwest to the misty northeast — is like watching a living galaxy unfurl beneath you. You don’t just see it; you feel it in every fibre of your being.
The peninsula glows like a jewel. To the left, Pune sparkles; below, Bengaluru… pic.twitter.com/ZWfwWFlz9R
— Shubhanshu Shukla (@gagan_shux) October 20, 2025
