Watch Video: నీ కష్టం పగోడికి కూడా రాకూడదు బ్రో.. దొంగతనం కోసమని వెళ్తే..
ఒక దొంగతనం చేయాలంటే చిన్న విషయమా.. దానికి ఎంతో ట్యాలెంట్ కావాలి, అంతకు మించిన ప్లాన్ ఉండాలి లేకపోతే వెళ్లిన చోటా అడ్డంగా బక్ కావాల్సిందే.. ఈ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను చూస్తే నేను దీని గురించి ఎందుకు చెబుతున్నానో మీకే అర్థమవుతుంది.

ఒక దొంగతనం చేయాలంటే చిన్న విషయమా.. దానికి ఎంతో ట్యాలెంట్ కావాలి, అంతకు మించిన ప్లాన్ ఉండాలి లేకపోతే వెళ్లిన చోటా అడ్డంగా బక్ కావాల్సిందే.. ఇక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో కూడా ఒక వ్యక్తి ప్లాన్ లేకుండా దొంగతనానికి వెళ్లి నానా తిప్పలు పడ్డాడు. షాప్ బయట పెట్టిన పళ్లట్రేను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అడుగడుగున అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ వీడియోలో అతను పడిన తిప్పలు చూస్తే మనకు నవ్వు ఆగదు.
అయితే స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలను ఒక వ్యక్తి తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక షాప్ ముందు కొన్ని పండ్ల ట్రేలు ఉన్నాయి. అయితే వాటిని చూసిన ఒక వ్యక్తి స్కూటీ మీద వచ్చి ఫ్రూట్ ట్రేను ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అక్కడున్న ట్రేను తీసుకుని తన స్కూటీ మీద పెట్టుకొవడానికి ప్రయత్నించాడు. మొత్తానికి దాన్ని స్కూటీలో పెట్టుకున్నాడు. కానీ స్కూటీని స్టార్ట్ చేసే టర్న్ అవుదామనుకునే లోపే పండ్ల ట్రే కిందపడిపోయింది.దీంతో ట్రేలో ఉన్న పళ్లన్నీ రోడ్డు మీద పడిపోయాయి. ఆ తర్వాత స్కూటీని బ్యాలెన్స్ చేసి ట్రేని అందుకున్నాడు. ఇంతలో అతని హెల్మెట్ ఊడిపోయింది.
వీడియో చూడండి..
View this post on Instagram
అయితే హెల్మెట్‌ను తీసుకోవడానికి ప్రయత్నించగా మళ్లి బ్యాలన్స్ ఔట్ అయి అతని స్కూటీ పడిపోయింది. ఇక ఎలాగోలా స్కూటర్‌ను పైకి లేపి స్టార్ట్ చేసుకొని ముందుకు వెళ్లాడు. కానీ అక్కడ కూడా అతని మరో అడ్డంకి ఎదురైంది. రోడ్డుపై నీరు ఉండడంతో స్కూటీ స్కిడ్ అయి పడిపోయింది. ఇలా దొంగతనం మొదలు పెట్టినప్పటి నుంచి వెళ్లిపోయే దాకా అతనికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. వాటిని ఫేస్ చేసేందుకు ఆ వ్యక్తి నానా తంటాలు పడ్డాడు. ఇన్‌స్టాలో ఈ వీడియో చూసిన నెటిజన్‌లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
