మీరు ఇంటలీజెంట్‌నా.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో 10 సెకన్స్‌లో చెప్పండి!
మెదడుకు పదును పెట్టే అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి ఓ చిత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలా మంది నేను చాలా ఇంటలీ జెంట్, ఏదైనా సరే పది సెకన్స్‌లో చెప్పేస్తాను అంటుంటారు. అయితే అలాంటి వారికోసమే ఈ చిన్న పరీక్ష, మరి మీరు నిజంగానే ఇంటలీజెంట్‌నో కాదో, ఈ చిత్రం ద్వారా తెలుసుకోండి. కేవలం పది సెకన్స్‌లో మీరు ఈ ఫొటోలో ఉన్న కుందేలును కనుగొంటే, మీ కంటి చూపు, మీ మైండ్ చాలా షార్పుగా ఉన్నట్లే.
Updated on: Jul 26, 2025 | 4:32 PM

మెదడు పనితీరును మెరుగుపరుచుకొని, మన సామర్థ్యాలను తెలుసుకోవడానికి చాలా మంది పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ , బ్రెయిన్ టీజర్ వంటివి ఎక్కువగా ఆడుతుంటారు. అయితే మీకు మంచి IQ ఉందని అనుకుంటారు. ఏదైనా తేలికగా చేస్తాం అనుకునే వారికోసమే ఈ పరీక్ష. దీని బట్టి మీరు మీ నాలెడ్జ్ లెవల్స్ తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఇది ఎవరైతే సమర్థవంతగా తెలపగలరో వారు చాలా ఇంటలీజెంట్ అంట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆప్టికల్ ఇల్యూషన్‌లోకి వెళ్ళేద్దాం.

తెలివితేటలు మరియు దృశ్య తీక్షణతను సవాలు చేసే ఆప్టికల్ ఇల్యూజన్ , బ్రెయిన్ టీజర్ మరియు ఇతర పజిల్ గేమ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇవి సరదా ఆటలే కాదు, మన మెదడుకు వ్యాయామం చేసే మార్గం కూడా. మీరు కళ్ళను సవాలు చేసే ఆప్టికల్ ఇల్యూషన్ గేమ్‌లను కూడా ఆడి ఉండవచ్చు. వైరల్‌గా మారిన అలాంటి ఒక ఆప్టికల్ చిత్రం ఇక్కడ ఉంది, దీనిలో కుందేలును కనుగొనడానికి ఒక సవాలు ఇవ్వబడింది. మీరు కేవలం 10 సెకన్లలో దాక్కున్న కుందేలును కనుగొనాలి. కాబట్టి, మీరు సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా?

మీ కోసం పైన నేలకి చాలా దగ్గరిగా ఒక పొదలాంటి చెట్టు కనిపిస్తుంది. అక్కడ కింద చిందరవందరగా చాలా ఆకులు భూమిపై పడి ఉన్నాయి. అయితే అందులో ఓ చిన్న కుందేలు ఉంది. అంతే కాదండోయ్, అది ఎలా దాక్కోవాలో, ఎవైరైనా తాను ఉన్నస్థలం వద్దకు వస్తున్నారేమో అని నక్కి నక్కి చూస్తుంది. మరి మీరు ఆ కుందేలును కనిపెట్టగలర.

ఈ స్పెషల్ ఆప్టికల్ ఇల్యూషన్ r/FindTheSniper అనే రెడ్డిట్ ఖాతాలో షేర్ చేయబడింది. ఆయన షేర్ చేసిన చిత్రంలో ఒక పొదలాంటి చెట్టు వద్ద కుందేలు కూర్చొని ఉందంట. మరి ఆలస్యం చేయకుండా కుందేలు ఎక్కడ ఉందో గుర్తించండి.

ఏంటీ, మీరు ఎంత వెతికినా కుందేలు ఎందుకు దొరకడం లేదా? చింతించకండి, ఇక్కడ సమాధానం ఉంది. పై చిత్రంలో, మొదటి చూపులో, మీరు చెట్టు పొద, నేలపై చిందరవందరగా ఉన్న ఆకులను మాత్రమే చూస్తున్నారేమో, అయితే ఆ కిందపడిన ఆకులను దగ్గరగా చూస్తే మీకు కుందేలు కనిపిస్తుంది. ఆకుల మధ్యనే గోధుమ రంగు కుందేలు కూర్చుని ఉంది. కనిపించిందా? ఇలాంటి గేమ్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.



