ముత్తాతల ఆరోగ్య రహస్యం ఇదే.. ఏ రొట్టె ఆరోగ్యానికి మేలు చేస్తుందో తెలుసా..
సాధారణంగా మనం తినే రొట్టెలు ఒకటి జొన్న రొట్టె, ఇంకొకటి చపాతి( గోదుమ రొట్టే) కదా.. కానీ మన ఆరోగ్యానికి ఏ ధాన్యపు రొట్టె ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?.. పోషకాహారం, ఆరోగ్యం పరంగా చూసుకుంటే గోధుమల కంటే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఎన్నో రొట్టెలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం పదండి.
Updated on: Jul 26, 2025 | 4:23 PM

Finger Millet

జొన్న రొట్టె - ఇది గ్లూటెన్ రహిత ధాన్యం. గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి ఇది ఒక గొప్ప ఎంపిక. జొన్న రొట్టెలో ఫైబర్, ప్రోటీన్, వివిధ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పాటు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించగలదు. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.

రాగి రొట్టె ఇందులో ముఖ్యంగా మనకు అధిక కాల్షియం లభిస్తుంది. ఎముకలను బలోపేతం. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను నివారించడానికి రాగి రెట్టే ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఇనుము, ఫైబర్, ముఖ్యమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది మన బరువు పెరగకుండా నియంత్రించగలదు కూడా

గోధుమ చపాతీ.. ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మనకు శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా ఇందులో ఉండే విటమిన్ బి, ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది. కానీ గోధుమలను ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల వాటిలోని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంది.

అయితే అన్ని ధాన్యాలకు వాటి సొంత ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. శనగ పిండి మాత్రం వీటన్నింటిలో ప్రత్యేకం. ఇందుకు కారణం దానిలో ఉండే కాల్షియం, ఇనుము, గ్లూటెన్ రహిత లక్షణాలు. ఇది అన్ని వయసుల వారికి అనుకూలంగా ఉంటుంది. ఇది సులభంగా జీవర్ణం కావడంతో పాటు ఎక్కవ కాలం ఆకలిని నింత్రిస్తుంది.




