Marital Life: ఇదే అసలైన దాంపత్య జీవితం.. భార్య చివరి కోరిక నెరవేర్చిన భర్త.. ఏం చేశాడో తెలుసా..?
Man donates Rs 17 lakh gold jewellery: ఆలుమగల దాంపత్యం అంటే.. తనువుల పరంగానే కాదు.. మనసుల పరంగా కూడా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భార్యా, భర్త ఇద్దరూ

Man donates Rs 17 lakh gold jewellery: ఆలుమగల దాంపత్యం అంటే.. తనువుల పరంగానే కాదు.. మనసుల పరంగా కూడా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భార్యా, భర్త ఇద్దరూ ప్రేమ బాంధవ్యాలతో.. కలకాలం ఒకే తాటిపై నడిస్తేనే.. అదే అసలైన దాంపత్య జీవితమంటారు. దానికి ఉదాహరణగా ఓ వ్యక్తి నిలిచాడు. భార్య చివరి కోరికను నెరవేర్చి భర్త.. ఎందరో దంపతులకు ఆదర్శంగా నిలిచాడు. భార్య చివరి కోరిక మేరకు.. 17 లక్షల విలువైన బంగారు ఆభరణాలను.. ప్రముఖ దేవాలయానికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. జార్ఖండ్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య చివరి కోరిక మేరకు.. మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ ఆలయంలో రూ. 17 లక్షల విలువైన బంగారు ఆభరణాలను విరాళంగా ఇచ్చాడని ఆలయ అధికారి మంగళవారం తెలిపారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
సంజీవ్ కుమార్, రష్మీప్రభ దంపతులు జార్ఖండ్‌లోని బొకారో నివాసితులు. రష్మీప్రభ మహాకాళేశ్వరుని భక్తురాలు. నిత్యం ఈ ఆలయాన్ని సందర్శిస్తుండేది. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రష్మీప్రభ చనిపోయే ముందు.. తన నగలను మహాకాళేశునికి సమర్పించాలని భర్త సంజీవ్ కుమార్‌ను కోరింది. అయితే.. ఆమె చనిపోయిన తర్వాత.. రష్మీప్రభ కోరికను తీర్చేందుకు భర్త సంజీవ్ కుమార్.. ఆలయంలో 17లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను సమర్పించినట్లు ఉజ్జయినీ ఆలయ నిర్వాహకుడు గణేష్ కుమార్ ధాకడ్ తెలిపారు.
చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని.. ఆమె చనిపోయే ముందు ఆలయంలో తన తల్లి ఇచ్చిన బంగారు నగలను దేవుడికి సమర్పించాలని చెప్పిందని ఆమె భర్త సంజీవ్ కుమార్ ఆలయ నిర్వహకుడికి తెలియజేశారు. 17 లక్షల విలువ చేసే.. మొత్తం 310 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందించినట్లు ఆలయ నిర్వహాణాధికారి తెలిపారు.
Also Read: