AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inners Robbery: ఎవరూ చూడట్లేదని ఇన్నర్‌వేర్ దొంగిలించాడు.. ఊహించిన రీతిలో గూబ పగిలింది..!

Inners Robbery: చిన్న వస్తువును దొంగిలించినా.. పెద్ద వస్తువులు దొంగిలించినా దొంగ అనే అంటారు. అయితే, దోపిడీ దొంగల్లో ఒక్కో రకమైన చోర కళ ఉంటుంది.

Inners Robbery: ఎవరూ చూడట్లేదని ఇన్నర్‌వేర్ దొంగిలించాడు.. ఊహించిన రీతిలో గూబ పగిలింది..!
Inner Robbery
Shiva Prajapati
|

Updated on: May 28, 2022 | 8:12 PM

Share

Inners Robbery: చిన్న వస్తువును దొంగిలించినా.. పెద్ద వస్తువులు దొంగిలించినా దొంగ అనే అంటారు. అయితే, దోపిడీ దొంగల్లో ఒక్కో రకమైన చోర కళ ఉంటుంది. కేటుగాళ్లు తమ తమ స్టైల్లో చోరీలకు పాల్పడుతుంటారు. కొందరు చిన్న చిన్న వాటినే దొంగిలించి ఆనందపడిపోతుంటారు. మరికొందరు కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా.. పెద్ద పెద్ద దోపిడీలు చేస్తుంటారు. అయితే, పెద్ద పెద్ద దోపిడీలు చేసే వారు అంత ఈజీగా దొరకరు కానీ.. చిన్నాచితక చోరీలకు పాల్పడే వారు ఇట్టే దొరికిపోతారు. తాజాగా అలాంటి ఘటనే కర్నాకటలో వెలుగు చూసింది. రెగ్యులర్ దొంగనో కాదో తెలియదు కానీ.. చాలా ఈజీగా దొరికిపొయాడు. పొట్టు పొట్టుగా దెబ్బలు తిన్నాడు. ఇంతకీ అతను కొట్టేసింది ఏంటో తెలిస్తే ఇంకా షాక్ అవుతారు. అతను చోరీ చేసింది ఒక ఇన్నర్ వేర్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

కర్నాటకలోని విజయపురలో గల ఎల్‌బిఎస్ మార్కెట్‌లోని ఓ బట్టల దుకాణంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. దుస్తులు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు నటించాడు. లోదుస్తులు చూపించాల్సిందిగా షాపు వాళ్లను అడిగాడు. దాంతో ఆ షాపు అతను.. కొన్ని ఇన్నర్స్ చూపించాడు. అవి బాలేదని, మరికొన్ని చూపించాలని కోరాడు. దాంతో షాపు యజమాని మరికొన్ని ఇన్నర్స్ తీసి చూపించేందుకు వెనక్కి తిరిగాడు. అదే అదునుగా భావించిన దొంగ.. ఒక ఇన్నర్‌ను కాజేశాడు. ఎడమ చేతితో ఎన్నర్ బాక్స్‌ తీసుకుని కాళ్ల మధ్యలో పెట్టుకున్నాడు. అయితే, ఇదంతా గమనించిన యజమాని కాసేపు గమ్మున ఉన్నాడు. అది చూపించు.. ఇది చూపించు అంటున్న క్రమంలో ఒక్కసారిగా బయటకు వచ్చి.. అతని చేతిలో దాచిన ఇన్నర్‌ను చూశాడు. సెకన్ కూడా ఆలస్యం చేయకుండా.. పాట్ పాట్‌మని గూబ గుయ్‌మనిపించాడు. పొట్టు పొట్టుగా కొట్టాడు. ఈ ఘటన అంతా షాపులోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

Follow Us
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
ఏమి టాలెంట్ బ్రో.. చెత్తబుట్టతో కూలర్..సామాన్యుడి సూపర్ ఐడియా
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
రేషన్‌కార్డు ఉన్న వారికి కేంద్రం గుడ్‌న్యూస్‌.. త్వరలో కొత్త స్కీ
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
ఐపీఎల్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్‌ చేయనున్న టీమిండియా ప్లేయర్లు..!
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
మల్బరీ పండ్లే కాదు..వాటి ఆకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
రుణం లేకుండా కారు లేదా ఇల్లు ఎలా కొనాలి? సూపర్ ఫార్ములా..!
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
బాదం vs వేరుశెనగ.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
వేడితో యూరిన్ రాని వాళ్ళు.. కూల్ చేసే సల్సా డ్రింక్ తాగేయండి
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే
40టీస్‌లో కూడా 20టీస్ కనిపించాలా?.. డైలీ ఈ వర్కౌట్స్ చేయాల్సిందే