AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంత సింపుల్‌గా ఎలా సార్.. 15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో

సాధారణంగా ఒక చిన్న పామును పట్టుకోవాలంటే స్నేక్ క్యాచర్స్ ముప్ప తిప్పలు పడుతారు. ఇక దాదాపు 15 అడుగుల కింగ్‌ కోబ్రాను బంధించాలంటే మామూలు విషయమా? దాన్ని పట్టుకోవాలంటే నాలుగైదు గంటలైనా పడుతుంది కదా.. కానీ ఇక్కడ సీన్ చూసిన తర్వాత మీరు కచ్చితంగా మీ నిర్ణయం మార్చుకుంటారు. అవును ఇక్కడ అధికారులు కేవలం 30 సెకన్లలోనే ఓ భారీ కింగ్‌ కోబ్రాను బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అంత సింపుల్‌గా ఎలా సార్.. 15 అడుగుల పామును జస్ట్ 30 సెకన్లలోనే పట్టేశారు.. ఇదిగో వీడియో
Viral See How Officials Caught A 15 Ft King Cobra In 30 Secs
Anand T
|

Updated on: Jun 01, 2026 | 8:21 PM

Share

మనకు చిన్న పాము కనిపిస్తే ఆమడదూరం పరిగెడతాము.. అలాంటి దాదాపు 15 అడుగుల పొడవున్న భారీ కింగ్‌ కోబ్రా కళ్లముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోదు. అచ్చం అలాంటి సంఘటనే ఇక్కడ వెలుగు చూసింది. రద్దీగా ఉండే రోడ్డుపై అకస్మాత్తు ఓ భారీ కింగ్‌ కోబ్రా దూసుకొచ్చింది. రోడ్డుపై పామును చూసి వాహనదారులకు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖ సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడి చేరుకున్న అధికారులు పామును పట్టుకునేందుకు ప్రయత్నించారు.

అయితే సాధారణంగా చిన్న పామును పట్టుకునేందుకు నానా తిప్పలు పడుతారు. కానీ ఇక్కడ అధికారులు మాత్రం జస్ట్ 30 సెకన్లలో 15 అడుగుల భారీ పొడవున్న ఆ కింగ్‌ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని సురక్షితంగా బంధించి అడవిలో వదిలేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం

అయితే పాముల్లో కెల్లా అత్యంత ప్రమాదకరమైనది, విలక్షణమైనదిగా గుర్తింపు పొందిన కింగ్ కోబ్రా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆసియా ఖండానికి మాత్రమే పరిమితమైన ఈ పాముల జాతి.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పంగా రికార్డు సృష్టించింది. సాధారణంగా దీన్ని మనం ‘తాచుపాము’ అని పిలిచినప్పటికీ, శాస్త్రీయంగా ఇది ‘ఓఫియోఫాగస్’ అనే ప్రత్యేకమైన ప్రజాతికి చెందిన ఈ కింగ్ కోబ్రా.

ఇది కేవలం చూడటానికి మాత్రమే సాధారణ నాగుపాములా కనిపిస్తుంది. ఈ కింగ్ కోబ్రా సాధారణంగా 3.18 మీటర్ల నుండి 4 మీటర్ల వరకు అంటే 10.4 నుండి 13.1 అడుగులు పొడవు పెరుగుతుంది. పొడవులోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత బరువైన విషసర్పాల జాబితాలో కూడా ఇది ముందు వరుసలో ఉంటుంది.

ఎక్కడ కనిపిస్తుంది?

భారత ఉపఖండం నుండి మొదలుకొని ఆగ్నేయాసియా, దక్షిణ చైనా ప్రాంతాల వరకు ఇది విస్తరించి ఉన్న అడవుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇవి మనుషులకు అంత సులభంగా కనిపించవు. దట్టమైన అడవుల్లో, జనసంచారానికి దూరంగా ఉండటానికే ఇవి ఎక్కువగా ఇష్టపడతాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
జీవించి ఉండగానే మీ శ్రాద్ధం మీరు చేసుకోవచ్చా? సంతానం లేని వారు..
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
ఐపీఎల్ వేలానికి ముందే గోయెంకా మైండ్ గేమ్.. అమ్మకానికి లక్నో టీమ్
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
వార్తకూ.. వాస్తవం లేని ప్రచారానికీ తేడాను గుర్తించండి..
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
బీసీసీఐ సెలెక్షన్ తీరుపై మాజీ క్రికెటర్ ఫైర్
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
కోట్ల రెమ్యునరేషన్ పక్కనపెట్టి కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి.
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్.. ఇక కాంటాక్ట్స్ కోసం..
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
సైబీరియా ప్లేగు పరిశోధనా ల్యాబ్‌లో రెండో మరణం..? WHO ఆందోళన
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
క్యాండీ క్రష్‌తో వరల్డ్‌ రికార్డు క్రియేట్ చేసిన ఇండియన్ కుర్రాడు
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నాకు మా నాన్న కావాలి.. ఎగ్జామ్‌లో చిన్నారి ఆన్సర్..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..
నానా పటేకర్ భార్య ఎవరో తెలుసా.. ? పదేళ్ల తర్వాత..