Viral Video: గేదె పిల్లను నోట కరిచిన సింహం.. మృగరాజుతో తల్లి గేదె పోరాటం.. చివరికి ఏమైందంటే.!
Lion Viral Video: సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తుంటారు. మృగరాజును దూరం నుంచి చూస్తే చాలు మిగిలిన జంతువులు ఠక్కున పరుగులు...

సింహాన్ని అడవికి రారాజు అని పిలుస్తుంటారు. మృగరాజును దూరం నుంచి చూస్తే చాలు మిగిలిన జంతువులు ఠక్కున పరుగులు పెడతాయి. సింహం వేట ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర జంతువులతో పోలిస్తే.. సింహం కొంచెం భిన్నమని చెప్పాలి. సింగిల్‌గా వేటాడే సింహం.. మిగతా జంతువులు గుంపుగా వచ్చినా ధైర్యంగా పోరాడుతుంది. అస్సలు పోరాటంలో వెనుకంజ వేయదు. ప్రాణాలు పోయేంత వరకు వేటాడుతుంది. తాజాగా సింహం పోరుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. ఒంటరిగా ఉన్న గేదె పిల్లను పట్టుకుని సింహం పారిపోయినట్లు మీరు చూడవచ్చు. తన బిడ్డను కాపాడుకునేందుకు తల్లి గేదె సింహంతో పోరాడినా.. ఏమాత్రం ప్రయోజనం ఉండదు. సింహం తెలివి, వ్యూహం, బలం ముందు తలవంచాల్సిందే.!
మొదటి ప్రయత్నంలో గేదె తన బిడ్డ కోసం సింహంతో గట్టిగా పోరాడగా.. రెండో ప్రయత్నంలో మాత్రం విఫలమవుతుంది. మృగరాజు నుంచి తన బిడ్డను కాపాడుకోలేకపోతుంది. తద్వారా సింహం తన ఎరను దవడలతో గట్టిగా పట్టుకుని అక్కడ నుంచి పారిపోతుంది. కాగా, ఈ వీడియోను వరల్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ అండ్ విలేజ్ అనే యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!
— World of Wildlife and Village (@WorldofWildlif1) September 13, 2021
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!