Viral Video: ఈ కోతి భలే హుషారైనది..! జింకపై కూర్చొని స్వారీ చేస్తుంది.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
Viral Video: జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ఈ వీడియోలు చూసిన తర్వాత ఇవి నిజమా అబద్ధమా
Viral Video: జంతువులకు సంబంధించిన ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి ఈ వీడియోలు చూసిన తర్వాత ఇవి నిజమా అబద్ధమా అనే అనుమానం కలుగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ కోతికి సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తుంది. ఇందులో ఒక హుషారైన కోతి జింకపై కూర్చొని రైడింగ్ చేస్తుంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు నవ్వకుండా ఉండలేరు. ఈ ఫన్నీ వీడియో గురించి ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వీడియోలో కోతి, జింక రహదారిపై కనిపిస్తాయి. కానీ కోతి జింకపై ఊరేగడం మనం వీడియోలో చూడవచ్చు. కోతి చలాకిగా జింకపై కూర్చొని స్వారీ చేస్తుంటుంది. జింక ఏమి అనకుండా రోడ్డుపై నడుస్తూ వెళుతుంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత జింక పారిపోవడాన్ని మనం వీడియోలో గమనించవచ్చు. అయినప్పటికీ కోతి జింకపై నుంచి కిందికి దిగదు. అలాగే గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఈ వీడియోలో రెండు జంతువులు అందంగా కనిపిస్తాయి. ప్రజలు ఈ వీడియోను చూసి తెగ నవ్వుకుంటున్నారు. లైక్స్, షేర్స్, కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోను వైరల్ హాగ్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి షేర్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు కూడా వీడియోపై చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశాడు. ‘ఇది బలవంతమైన చర్య ‘ అన్నాడు. మరొక వినియోగదారు ‘మనుషుల వలె జంతువులు కూడా అన్నీ అర్థం చేసుకుంటాయి’ అన్నాడు. మరో వినియోగదారు ‘హాయ్! ఈ స్నేహం చాలా అందంగా సరదాగా ఉంది’ అన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఈ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram
Wedding: పెళ్లైన అరగంటకే ట్విస్ట్.. బ్యూటీ పార్లర్‌కు వెళ్లి అదృశ్యమైన వధువు.. ఆ తర్వాత..
Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా..
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..