Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Hack : వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేసే బదులు ఇలా వాడండి.. మీ కిచెన్‌ మెరుస్తుంది..! మీ పని మరింత ఈజీ..?

కాలం చెల్లిన మందుల ఖాళీ పొట్లాలు, లేదంటే వాడి పడేసిన ట్యాబ్లెట్‌ పన్నీలను చెత్తలో వేయకండి... ఎందుకంటే ఇది వంటగదిని చాలా శుభ్రంగా చేస్తుందో తెలుసా.? ఇది మీ వంటగదిలో మీ శ్రమను తగ్గిస్తుంది. మీరు ఖాళీ అయిన మందుబిల్లల పన్నీతో కిచెన్‌ సామాన్లను, మాడిన వంటసామాగ్రిని మెరిసేలా చేసుకోవచ్చు. దీంతో మీ వంటిల్లు నిండా కొత్త సమాన్లతో మెరిసిపోతుంది. మీ పాత్రలన్నీ కొత్తవాటిలా కనిపిస్తాయి.

Cleaning Hack : వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేసే బదులు ఇలా వాడండి.. మీ కిచెన్‌ మెరుస్తుంది..! మీ పని మరింత ఈజీ..?
Medicineraper
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 26, 2024 | 6:22 PM

వంటగదిలో ఎన్నో రకాల పాత్రలు ఉపయోగిస్తుంటాం. తవా, కడాయి ఇలా అనే వంటకాల కోసం అనేక పాత్రలను వాడుతుంటాం..ఆహారం వండేటప్పుడు ఈ రెండు పాత్రలు మాడిపోవడం వల్ల నల్లగా మారుతుంటాయి. దీన్ని శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బును వాడుతుంటారు. మరికొందరు దీన్ని శుభ్రం చేసుందుకు బూడిదను కూడా ఉపయోగిస్తారు. ఇప్పటికీ, మీ వంట పాత్రలు మునుపటిలా మెరుస్తూ కనిపించవు..అలాంటప్పుడు ఈ వంటగది చిట్కాలు మీకు సహాయపడతాయి.

మీరు మీ వంటకాలను కొత్తవిగా చూడాలనుకుంటే, మీ ఇంట్లో ఉన్న ఖాళీ మందు పన్నీలు మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. మనం తరచుగా మందులను వాడుతుంటాం.. అవి ఖాళీ అయిన తర్వాత వాటిని చెత్తగా పారేస్తాం. మీరు కూడా ఇలా చేస్తుంటే ఇకపై పరేయకండి..ఎందుకంటే ఖాళీ మెడిసిన్ రేపర్లు మీ వంటగది పనిని సులభతరం చేస్తాయి. వంటగదిలో ఔషధ రేపర్లను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

మాడిన వంట పాత్రలు మెరిసేలా చెయొచ్చు..

ఇవి కూడా చదవండి

అన్నింట్లో మొదటిది మాడిన కడాయి, పాన్‌ మునుపటిలా మెరవాలంటే.. ముందుగా దానిపై ఉప్పు, స్వీట్ సోడా లేదా ఇనో వేయండి.. ఇప్పుడు దానిపై కొద్దిగా వేడినీరు పోయాలి. ఇప్పుడు మెడిసిన్ రేపర్ సహాయంతో 2-4 నిమిషాలు రుద్దండి. ఈ ట్రిక్ వాడకంతో మీ వంటింట్లోని తవా, లేదంటే పాన్ మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తుంది.

కత్తెరకు పదును పెట్టవచ్చు..

కత్తెర అంచుని పదును పెట్టడం కూడా చేసుకోవచ్చు. చాలా సార్లు కత్తెర అంచు చాలా మొండిగా మారుతుంది. దాంతో ఏదీ సరిగ్గా కత్తిరించబడదు. అటువంటి పరిస్థితిలో, దాని అంచు మెడిసిన్‌ కవర్ సహాయంతో పదును పెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక రేపర్ తీసుకోండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉండండి. దీన్ని కనీసం 2-3 నిమిషాలు చేయండి. కత్తెర అంచు చాలా పదునుగా మారుతుంది.

మిక్సర్ గ్రైండర్ బ్లేడ్ పదును పెట్టుకోవచ్చు..

మీరు మిక్సర్ గ్రైండర్ బ్లేడ్‌లను మెడిసిన్ రేపర్‌తో పదును పెట్టవచ్చు. దీని కోసం, కత్తెరతో మందు రేపర్ చిన్న ముక్కలను కత్తిరించండి. దీన్ని ఒక జాడీలో వేసి రెండు నిమిషాలు తిప్పండి. ఈ ట్రిక్ సహాయంతో, మిక్సర్ బ్లేడ్ అంచు పదును పెట్టబడుతుంది. ఇక్కడో విషయం గుర్తుంచుకోండి. దాని పదునైన అంచు కారణంగా ట్యాబ్లెట్‌ రేఫర్‌ చాలా పదునైన అంచుని కలిగి ఉంటుంది. ఒక్కోసారి చేతులు కూడా తెగిపోయే ప్రమాదం ఉంటుంది. వాటిని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..