Viral Video: మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. మండిపడుతున్న నెటిజన్స్, వీడియో వైరల్

ప్రయాణికుల సంక్షేమం కోసం, తమ తమ గమ్యస్థానాలను చేరవేయడానికి మెట్రో రైళ్లు అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి ఉద్యోగస్తుల వరకు ప్రతిఒక్కరూ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. జస్ట్ కేవలం టికెట్ కొంటే చాలు.. ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు.

Viral Video: మెట్రో రైలులోకి రైతుకు నో ఎంట్రీ.. మండిపడుతున్న నెటిజన్స్, వీడియో వైరల్
Metro
Follow us
Balu Jajala

|

Updated on: Feb 26, 2024 | 4:30 PM

ప్రయాణికుల సంక్షేమం కోసం, తమ తమ గమ్యస్థానాలను చేరవేయడానికి మెట్రో రైళ్లు అందుబాటులో వచ్చిన విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి ఉద్యోగస్తుల వరకు ప్రతిఒక్కరూ మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు. జస్ట్ కేవలం టికెట్ కొంటే చాలు.. ఎక్కడికైనా జర్నీ చేయొచ్చు. కానీ బెంగళూరు మెట్రో సెక్యూరిటీ రైతును తీవ్రంగా అవమానించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల బెంగళూరు సిటీలో మెట్రో రైలులో ప్రయాణించడానికి ఒక రైతుకు అనుమతి నిరాకరించారు. భద్రతా తనిఖీల వద్ద అధికారులు అతని బట్టలు మురికిగా ఉన్నాయని మెట్రోలో ప్రయాణించడానికి నో చెప్పారు. తెల్ల చొక్కా ధరించి, తలపై బట్టల సంచితో ఉన్న రైతు తన ప్రయాణానికి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ చెక్ పోస్టు వద్ద ఆపారు.

ఎక్స్ లో షేర్ చేసిన వీడియోలో (గతంలో ట్విట్టర్ లో) మెట్రోలో ప్రయాణించడానికి స్టేషన్ లోకి ప్రవేశించిన మరో వ్యక్తి హిందీ మాత్రమే మాట్లాడే రైతుకు మద్దతుగా వచ్చాడు. మెట్రో సేవలను పొందాలంటే వినియోగదారులు డ్రెస్ కోడ్ పాటించాలనే నిబంధన ఉందా అని ఆయన మెట్రో అధికారులను ప్రశ్నించారు. ఆ వీడియోలో ఆ వ్యక్తి కన్నడలో ‘రైతు వద్ద ఎంట్రీకి అవసరమైన టికెట్ ఉంది. అతని బ్యాగులో బట్టలు మాత్రమే ఉన్నాయి. మెట్రోలోకి తీసుకురావడాన్ని నిషేధించలేదు. ఏ ప్రాతిపదికన ఆయనకు ప్రవేశం నిరాకరిస్తున్నారు? అని ప్రశ్నించాడు.

మెట్రో కేవలం వీఐపీ ప్రయాణానికి మాత్రమేనా లేక ప్రజా రవాణా కోసమా అని అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎంట్రీ ఇచ్చేందుకు క్యూలో ఉన్న మరికొందరు కూడా రైతుకు మద్దతుగా వచ్చి భద్రతా సిబ్బంది వివక్షతో వ్యవహరించారని మండిపడ్డారు. ఈ ఘటన ఆన్ లైన్ లో దుమారం రేపడంతో సెక్యూరిటీ సూపర్ వైజర్ ను విధుల నుంచి తొలగించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..