భార్యకు ఇంట్లోనే డెలవరీ చేసిన భర్త..! ఎంత ఘోరం జరిగిపోయిందంటే..?
ఒక పాస్టర్ తన భార్యకు ఇంట్లోనే ప్రసవం చేయడంతో నవజాత శిశువు మరణించింది. తల్లికి తీవ్ర రక్తస్రావం సంభవించింది. వైద్య సహాయం తీసుకోకుండా ఇంట్లోనే ప్రసవం చేయడం వలన ఈ విషాదం సంభవించింది. పోలీసులు విచారణ చేపట్టారు. మునుపటి ప్రసవాలనూ ఇంట్లోనే చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఓ వ్యక్తి తన భార్యకు ఇంట్లోనే ప్రసవం చేశాడు. ఈ ఘటన కేరళలోని పెరుంకలలోని అనకొంబన్‌లో సోమవారం చోటు చేసుకుంది. ఇంట్లో చేసిన ఈ డెలవరీ కారణంగా నవజాత శిశువు మరణించింది. ఆ శిశువు చలతర పుతెన్‌వీడు జాన్సన్ (45), విజి (45) దంపతుల కుమారుడు.
శిశువు మృతదేహాన్ని ఇడుక్కి మెడికల్ కాలేజీ ఆసుపత్రి (MCH)కు తరలించారు. ఈ సంఘటన తర్వాత, తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను MCH కు తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ సంఘటనపై విచారణ ప్రారంభించినట్లు ఇడుక్కి పోలీసులు తెలిపారు.
పెరుంకాల వార్డ్ సభ్యుడు అజేష్‌కుమార్ ప్రకారం.. విజి గర్భధారణ సమయంలో ఆ జంట ఎటువంటి వైద్య సంరక్షణను కోరలేదు. వారు ఏ వైద్యులను సంప్రదించలేదు లేదా ఎటువంటి ప్రసూతి సేవలను పొందలేదు అని అతను చెప్పాడు. వృత్తిరీత్యా పాస్టర్ అయిన జాన్సన్ కు పొరుగువారితో పెద్దగా పరిచయం లేదని అజేష్ కుమార్ తెలిపారు. ఈ దంపతులకు మరో ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఆ ప్రసవాలను కూడా జాన్సన్ నిర్వహించాడని ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
