ఆటో డ్రైవర్‌కు దొరికిన బంగారం బ్యాగ్.. డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్
ఈ రోజుల్లో పోగొట్టుకున్న వస్తువులు గానీ, నగదు గానీ మళ్లీ దొరకడం అంటే కలే. ఎవరి కంట అయినా పడ్డాయి అంటే ఇక వాటి గురించి మర్చిపోవాల్సిందే. ఇక బంగారం వంటి విలువైన వస్తువులైతే ఆశలు వదులుకోవాల్సిందే. అలాంటిది ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. నడిరోడ్డుపై తనకు దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు ఉన్న సంచిని.. దాన్ని పోగొట్టుకున్న మహిళలకు అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు.
నిర్మల్ జిల్లా కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్‌లో ఆరోగ్యమిత్రగా పనిచేస్తోంది. ఆమె శనివారం సాయంత్రం కుమారుడితో కలిసి నిర్మల్ నుంచి ఖానాపూర్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు, కొంత నగదు, గుర్తింపు పత్రాలతో కూడిన సంచిని వాహనానికి తగిలించగా.. కొండాపూర్ సమీపంలోని బైపాస్ వద్ద ఆ సంచి పడిపోవడాన్ని వారు గమనించలేదు. ఆ సమయంలో లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ సాయికుమార్ తన ఆటోలో ప్రయాణికులతో నిర్మల్ నుంచి కనకాపూర్ వైపు వెళ్తున్నాడు. ఆ ఆటోలో ఉన్న వడ్యాల్ గ్రామానికి చెందిన సౌజన్య అనే ప్రయాణికురాలు రోడ్డుపై పడి ఉన్న సంచిని గమనించింది. వెంటనే ఆ విషయాన్ని డ్రైవర్‌కు చెప్పింది. సాయికుమార్ దాన్ని ఇంటికి తీసుకెళ్లారు. బంగారంతో కూడిన సంచి పోయిందని సామాజిక మాధ్యమాల్లో సందేశాన్ని చూసిన సౌజన్య.. తన భర్త ద్వారా ఆటోడ్రైవర్ సాయికుమార్‌కు విషయాన్ని తెలియజేసింది. ఆదివారం బాధితులకు సమాచారం చేరవేయటంతో వారు వచ్చారు. బంగారం, నగదు, గుర్తింపు పత్రాలున్న సంచిని.. బాధితురాలు సుజాతకు సాయికుమార్ అందజేశారు. నిజాయతీ చాటుకున్న ఆయన్ను గ్రామస్థులు ఘనంగా సన్మానించి అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
త్వరలో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలు.. కంప్యూటర్లుగా మారనున్న పాత టీవీలు
Gold Price: మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు
దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

