AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏఐ రంగంలో ఉద్యోగాలు కావాలా? ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన

ఏఐ రంగంలో ఉద్యోగాలు కావాలా? ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన

Phani CH
|

Updated on: Sep 08, 2025 | 9:29 PM

Share

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రపంచాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న చాట్‌జీపీటీ రూపకర్త ‘ఓపెన్ఏఐ’ మరో సంచలన ప్రకటన చేసింది. ఏఐ నైపుణ్యాలున్న ఉద్యోగార్థులను, కంపెనీలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ‘ఓపెన్ ఏఐ జాబ్స్ ప్లాట్‌ఫామ్’ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం, ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ‘లింక్డ్ఇన్’కు ప్రత్యక్ష పోటీని సృష్టించనుంది.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, లింక్డ్ఇన్ మాతృసంస్థ మైక్రోసాఫ్ట్… ఓపెన్ఏఐలో సుమారు 13 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అతిపెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది. సొంత ఇన్వెస్టర్ సంస్థకే పోటీగా ఓపెన్ఏఐ ఈ కొత్త వేదికను తీసుకురావడం టెక్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వివరాలను ఓపెన్ఏఐ అప్లికేషన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫిడ్జీ సిమో గురువారం ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. “ఈ జాబ్స్ ప్లాట్‌ఫామ్ కేవలం పెద్ద కంపెనీలకు మాత్రమే కాకుండా, స్థానిక వ్యాపారాలు, ప్రభుత్వ సంస్థలు కూడా సరైన ఏఐ నిపుణులను నియమించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే ఈ వేదికకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. కానీ, కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారంటే.., 2026 మధ్య నాటికి ఈ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. జాబ్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు, ఏఐ నైపుణ్యాలపై అవగాహన పెంచేందుకు ‘ఓపెన్ఏఐ అకాడమీ’ ఆధ్వర్యంలో ఒక కొత్త సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సిమో ప్రకటించారు. ప్రాథమిక స్థాయి నుంచి అడ్వాన్స్‌డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వరకు వివిధ స్థాయిలలో ఈ సర్టిఫికేషన్లు అందిస్తారు. 2030 నాటికి 10 మిలియన్ల అమెరికన్లకు సర్టిఫికేషన్ అందించడమే తమ లక్ష్యమని ఓపెన్ఏఐ పేర్కొంది. ఏఐ కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తరుణంలో ఓపెన్ఏఐ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శక్తిపీఠంలో తెగిన రోప్‌వే.. ఆరుగురు దుర్మరణం

ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్

భారీ వరదలో చిక్కుకున్న బస్సులు.. భయంతో ప్రయాణికుల ఆర్తనాదాలు

చిట్టీలు కడుతున్నారా? ఇలాంటివారు ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త

అభిమాని చేసిన పనికి నివ్వెరపోయిన సంజయ్ దత్