రూ. 810 ఫుడ్‌కు రూ.1473 వసూలు? స్విగ్గీ పై కస్టమర్ ఫైర్ వీడియో
ఫుడ్ ఆర్డర్ చేయడం అనేది ఇప్పుడు చాలా సులభం అయింది. క్షణాల్లో రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఇంటికి వస్తుంది. సమయాభావంతో సతమతమయ్యే ఉద్యోగులు, వంట చేయడం రాని యువతలో చాలామంది తరచు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించిన ఫుడ్ యాప్స్ ఇప్పుడు భారీగా ధరలు పెంచేసి కస్టమర్లను దోచుకుంటున్నాయి. డెలివరీ చార్జ్, హ్యాండ్లింగ్ చార్జ్, జీఎస్టీ ఇలా రకరకాల పేర్లతో కస్టమర్లను భారీగా దోచుకుంటున్నాయి. ఫుడ్ మీద సదరు యాప్ వసూలు చేస్తున్న అధిక మొత్తాలపై ఒక కస్టమర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుందర్ అనే కోయంబత్తూర్ కు చెందిన ఒక కస్టమర్ తన ఇంటికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాలని అనుకున్నాడు. స్విగ్గీ యాప్ ఓపెన్ చేసి ఆ ఫుడ్ ధర చూడగా 1473 రూపాయలుగా చూపించింది. దీంతో అవాక్కైన అతడు నేరుగా రెస్టారెంట్ కు వెళ్లి అదే ఫుడ్ కొనుగోలు చేయగా కేవలం 810 రూపాయలు మాత్రమే వసూలు చేశారు. దీంతో అవాక్కైన కస్టమర్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్విగ్గీని నిలదీశాడు. నేరుగా కొంటే వసూలు చేసే దానికంటే ఏకంగా 81% అధికంగా ఆర్డర్ పెడితే వసూలు చేస్తున్నారని సదరు కస్టమర్ మండిపడ్డాడు. కేవలం రెండు కిలోమీటర్ల దూరానికి అదనంగా 663 రూపాయలు వసూలు చేయడం ఏ లెక్కన చూసినా అన్యాయమేనని వాపోయాడు. మధ్యతరగతి వారు కూడా ఇంతింత రేట్లు పెట్టి కొనలేరని ఫైర్ అయ్యాడు. దీంతో ఆ కస్టమర్ కు నెటిజన్లు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఫుడ్ డెలివరీ యాప్స్ కస్టమర్ల నుంచి దారుణంగా వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అంతరిక్షంలో ఇరుక్కుపోయా.. ఆక్సిజన్‌కి డబ్బులు పంపవా?వీడియో
వారికి జీతం 3 రెట్లు పెంపు.. ఒక్కొక్కరికీ నెలకు రూ.లక్షపైనే వీడియో
ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ పోస్ట్.. డియర్ గౌరీ అంటూ.. వీడియో
పని వాళ్లకి రూ.80 లక్షల ఇల్లు గిఫ్ట్ వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
