AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

త్వరలో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలు.. కంప్యూటర్లుగా మారనున్న పాత టీవీలు

త్వరలో అందుబాటులోకి టీ ఫైబర్ సేవలు.. కంప్యూటర్లుగా మారనున్న పాత టీవీలు

Phani CH
|

Updated on: Sep 08, 2025 | 9:35 PM

Share

ఇంటర్నెట్, డిష్‌టీవీ, ఓటీటీ సేవలన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌ మీద దొరికితే ఎలా ఉంటుంది? అసలు టీవీనే ఓ పెద్ద కంప్యూటర్‌ స్క్రీన్‌గా మారిపోతే ఎలా ఉంటుంది ఊహించుకోండి.. అది కూడా అతి చౌకగా అన్ని ఫెసిలిటీస్‌ లభిస్తే భలే ఉంటుంది కదూ.. యస్‌.. మీ ఊహలు నిజమయ్యి, మీ ఆశలు తీరే రోజు మరెంతో దూరంలో లేదు.

ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ-ఫైబర్ ప్రాజెక్టు త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. మొదటి దశలో ఇప్పటికే రూ. 3,500 కోట్లతో 12,751 గ్రామ పంచాయతీల్లో 42 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఆధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలను అతి తక్కువ ధరకే అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ-ఫైబర్ ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టును దసరా తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పట్టణాల్లో ప్రారంభమయ్యే ఇలాంటి ప్రాజెక్టులను గ్రామీణ ప్రాంతాల నుంచే మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీ-ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వారికి ఒక సెట్‌టాప్ బాక్స్ ఇస్తారు. ఈ బాక్స్ ద్వారా పాత టీవీలు కూడా స్మార్ట్ టీవీలుగా మారిపోతాయి. ఒక సెట్‌టాప్‌ బాక్స్‌ ద్వారానే, వైఫై, టీవీ చానల్స్, ఓటీటీ సేవలు లభిస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాల వివరాలు, ఆన్‌లైన్ పోల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. డాష్‌బోర్డ్ ద్వారా ముఖ్యమంత్రి నేరుగా లబ్ధిదారులతో వీడియో కాల్‌లో మాట్లాడతారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, సుమారు 35 వేల మందికి ఉపాధి కల్పించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా, లోకల్ కేబుల్ ఆపరేటర్లకు కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు

దిగంబర ముఠా అరాచకాలు.. గ్రామాల్లో నగ్నంగా తిరుగుతూ

ఏఐ రంగంలో ఉద్యోగాలు కావాలా? ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన

శక్తిపీఠంలో తెగిన రోప్‌వే.. ఆరుగురు దుర్మరణం

ఛాతిలో కత్తి.. అలాగే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాలుడు.. పోలీసులు షాక్