Gold Price: ఆకాశమే హద్దుగా.. బంగారం ధర
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. బంగారం ధర నాన్‌స్టాప్‌గా.. పెరిగి లక్షా 10 వేల మార్క్ దాటింది. సోమవారంతో పోల్చితే ఏకంగా రూ.1300 పైనే పెరిగి కొత్త రికార్డ్ సృష్టించింది. అటు.. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. సెప్టెంబర్ 9, మంగళవారం నాటి ధరలు పరిశీలిస్తే.. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో 24 కేరట్ల బంగారం ధర తులం రూ.1,10,290 రూపాయలుగా ఉండగా, 22 కేరట్ల గోల్డ్ ధర రూ.1,01,100గా ఉంది.
హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,36,900గా ఉంది. ఢిల్లీలో 24 కేరట్ల తులం బంగార ధర 1,08,520గా, 22 కేరట్ల తులం పుత్తడి ధర రూ.99,490లుగా ఉంది. ముంబైలో 24 కేరట్ల బంగార ధర 1,08,370గానూ, 22 కేరట్ల తులం బంగారం ధర రూ.99,490లుగా ఉంది. చెన్నైలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,08,370 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.99,350గా ఉంది. కోల్‌కతాలో 24 కేరట్ల బంగారం ధర రూ.1,08,370 ఉండగా.. 22 కేరట్ల ధర రూ.99,350గా ఉంది. ట్రంప్ సుంకాల సీజన్ ప్రారంభమైనప్పటి నుండి బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత రెండు నెలలుగా ధర పెరుగుతూ పోయిందే తప్ప.. డౌన్‌ట్రెండ్ మాత్రం కనిపించడం లేదని, మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
4 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. దంచికొట్టనున్న వర్షాలు
బిడ్డను ఫ్రీజర్ లో పెట్టి మరిచిపోయిన తల్లి.. చివరకు
Viral Video: బురదలో కదలకుండా పడి ఉన్న వ్యక్తి.. శవం అనుకుని పట్టుకోగానే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

