AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిడ్డ‌ను ఫ్రీజర్ లో పెట్టి మ‌రిచిపోయిన త‌ల్లి.. చివరకు

బిడ్డ‌ను ఫ్రీజర్ లో పెట్టి మ‌రిచిపోయిన త‌ల్లి.. చివరకు

Phani CH
|

Updated on: Sep 09, 2025 | 4:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో షాకింగ్‌ ఘటన జరిగింది. ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ తల్లి, కన్నబిడ్డనే తీసుకెళ్లి ఫ్రీజర్‌లో పెట్టింది. 15 రోజుల వయసున్న ఆ పసికందు ప్రాణాలతో బయటపడటం అదృష్టమనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్‌కు చెందిన ఓ మహిళ శుక్రవారం తన 15 రోజుల శిశువును ఫ్రీజర్‌లో పెట్టింది.

కొద్దిసేపటి తర్వాత ఫ్రీజర్ నుంచి చిన్నారి ఏడుపు వినిపించడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమై ఫ్రీజర్ తెరిచి చూడగా, అందులో చలికి వణికిపోతున్న పసికందు కనిపించింది. హుటాహుటిన చిన్నారిని బయటకు తీసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళ ప్రసవానంతరం మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రసవానంతరం మహిళల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. ఇన్‌ఫెక్షన్లు, రక్తస్రావం, ఇతర అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనతో బాలింతలు పోస్ట్‌మార్టమ్‌ సైకాసిస్‌ సమస్యకు గురవుతుంటారు. ఒకరకమైన విచారం, దిగులు, భయం, బెంగ, నిద్ర పట్టకపోవటం, చిరాకు, ప్రశాంత కోల్పోవడం వంటివి ఇబ్బంది పెడతాయి. కొందరు అకారణంగా భయపడొచ్చు, ఏడవచ్చు. త్వరతర్వగా అలసిపోతుండొచ్చు. బిడ్డను తాను సరిగా చూసుకోలేమోననీ బాధపడొచ్చు. అది ఎక్కువైతే విపరీత నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే అది ఎక్కువకాలం ఉండేదీ కాదు. ఈ సమయంలో పెద్దవాళ్లు, కుటుంబసభ్యులు తోడుగా ఉండి భరోసా, ధైర్యం కల్పించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే కొద్ది రోజుల్లో వాటంతటవే తగ్గిపోతాయి. మానసిక సమస్యలు తీవ్రమైతే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: బురదలో కదలకుండా పడి ఉన్న వ్యక్తి.. శవం అనుకుని పట్టుకోగానే..

ప్రమోషన్ ఇవ్వని బాస్.. ఏకంగా కంపెనీనే కొనేసిన ఉద్యోగిని

గాజు టవర్ ను చూసారా? అక్కడి నుంచి భూటాన్​ను చూడొచ్చు

వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ దందాతో కెమికల్ పరిశ్రమలపై డౌట్స్

బిహార్ ఎన్నికల్లో హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్