Viral Video: బురదలో కదలకుండా పడి ఉన్న వ్యక్తి.. శవం అనుకుని పట్టుకోగానే..
ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే.. ఆ మృతదేహాన్ని వారి ఇంటికో, .. లేక అంత్యక్రియల కోసమో తరలిస్తుండగా.. ఒక్కసారి లేచి కూర్చుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. దెయ్యం అనుకుని భయంతో పరుగులు తీసేవారు కొందరైతే.. ఊహించని పరిణామానికి షాకై చూసేవారు కొందరుంటారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది.
సాగర్ జిల్లా పరిధిలోని ఖురాయ్ గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ధనోరా, బంఖిరియా గ్రామాల మధ్య రోడ్డు పక్కన బురదలో ఓ వ్యక్తి బోర్లోపడి ఉన్నాడు. గంటల తరబడి అలాగే కదలకుండా ఉండటంతో అతడు.. చనిపోయాడని భావించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ హుకుమ్ సింగ్ తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్తగా శవ వాహనాన్ని కూడా రప్పించారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో గ్రామస్థులు గుమిగూడారు. పోలీసులు అక్కడే పంచనామా జరిపి.. శవాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు.గ్రామస్థుల సహాయంతో మృతదేహాన్ని పైకి లేపి.. వాహనంలో ఎక్కించే పనిలో పడ్డారు. అయితే..అంతలోనే మృతదేహం కదలసాగింది. దీనిని గమనించి.. పోలీసులు ఒక్కసారిగా దూరంగా వెళ్లిపోయారు. అప్పటివరకు మృతదేహం అనుకున్న మనిషి.. నెమ్మదిగా కళ్లు తెరిచి, లేచి నిలబడ్డాడు. వణుకుతున్న స్వరంతో, “సార్, నేనింకా బతికే ఉన్నాను” అన్నాడు. ఆ మాట వినగానే పోలీసులు, గ్రామస్థులు ఒక్కసారిగా షాకయ్యారు.ఇంకొందరు దెయ్యం బాబోయ్ అంటూ కేకలు వేసుకుంటూ దూరంగా పరుగులెత్తారు. తేరుకున్న పోలీసులు ఏం జరిగిందని అతన్ని ఆరా తీశారు. తాను అతిగా మద్యం సేవించానని, రోడ్డు పక్కన మూత్ర విసర్జనకు ఆగి, అదుపుతప్పి బురదలో పడిపోయానని చెప్పాడు. తీవ్రమైన మత్తులో ఉండటంతో పైకి లేవలేకపోయానని తెలిపాడు. అతని బైక్ కూడా సమీపంలోనే పోలీసులకు లభించింది. ఘటనపై స్థానికులు స్పందిస్తూ..‘మేమంతా అతడు చనిపోయాడనే అనుకున్నాం. కానీ అతను లేచి మాట్లాడటంతో దెయ్యం అనుకొని భయపడ్డాం’ అని తెలిపారు. అనంతరం పోలీసులు అతన్ని సురక్షితంగా ఇంటికి పంపించారు. అయితే..చచ్చిన మనిషి బతికాడంటూ ఈ వార్త ఆ ప్రాంతమంతా విపరీతంగా వైరల్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రమోషన్ ఇవ్వని బాస్.. ఏకంగా కంపెనీనే కొనేసిన ఉద్యోగిని
గాజు టవర్ ను చూసారా? అక్కడి నుంచి భూటాన్ను చూడొచ్చు
వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ దందాతో కెమికల్ పరిశ్రమలపై డౌట్స్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

