AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులారా మీకో గుడ్‌న్యూస్‌.. ఖాళీ మద్యం సీసా తిరిగి ఇస్తే రూ. 20లు వస్తాయ్..! ట్విస్ట్‌ ఏంటంటే..

మందుబాబులకు ఇదేదో పనికొచ్చే వార్తల ఉందే.. అవును, నిజంగానే వారికి ఈ వార్త పనికొస్తుంది... ఎందుకంటే దాదాపుగా అందరూ తాగేసిన తరువాత ఖాళీ మద్యం సీసాలను పడేస్తుంటారు. కొందరు ఖాళీ బీర్ సీసాలను అర్ద రూపాయికి, రూపాయికి అమ్మేస్తుంటారు. కానీ, ఇకపై అలా చేయకండి.. ఖాళీ మద్యం సీసాలను తిరిగి ఇస్తే రూ. 20 చెల్లించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించింది. ఇంతకీ ఎక్కడంటే..

మందుబాబులారా మీకో గుడ్‌న్యూస్‌.. ఖాళీ మద్యం సీసా తిరిగి ఇస్తే రూ. 20లు వస్తాయ్..! ట్విస్ట్‌ ఏంటంటే..
Return Bottle For Refund
Jyothi Gadda
|

Updated on: Aug 01, 2025 | 1:31 PM

Share

పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కేరళ రాష్ట్ర పానీయాల కార్పొరేషన్ (బెవ్కో) అవుట్‌లెట్లలో విక్రయించే మద్యం బాటిళ్లను తిరిగి తీసుకోవడానికి ఒక కొత్త ప్రణాళిక రూపొందించింది. సెప్టెంబర్‌లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించి, ప్లాస్టిక్, గాజు సీసాలలో విక్రయించే మద్యంపై అదనంగా రూ.20 వసూలు చేయబడుతుంది. వినియోగదారులు బాటిళ్లను అవుట్‌లెట్‌కు తిరిగి ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఎక్సైజ్ శాఖ తెలిపింది.

ఈ రూ.20ని అదనపు ఛార్జీగా చూడకూడదని, బాధ్యతాయుతమైన వినియోగంలో పెట్టుబడిగా చూడాలని ఎక్సైజ్ మంత్రి ఎం.బి. రాజేష్ స్పష్టం చేశారు. ట్రాకింగ్, వాపసులను సులభతరం చేయడానికి ప్రతి బాటిల్‌కు క్యూఆర్ కోడ్ జతచేయబడుతుంది. ప్రస్తుతం కేరళ బేవరేజెస్ కార్పొరేషన్‌ ద్వారా ఏడాదికి దాదాపు 70 కోట్ల మద్యం సీసాలు అమ్ముడవుతున్నాయి. వీటిలో కేవలం 56 కోట్ల బాటిళ్లు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ప్రభుత్వం తెలిసింది. మిగిలినవి పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయని స్పష్టం చేసింది.

క్లీన్ కేరళ కంపెనీ సహకారంతో ప్రారంభించబడిన ఈ ప్రాజెక్టును తిరువనంతపురం, కన్నూర్‌లలో ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఇలాంటి బాటిల్-రిటర్న్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు నుండి రాష్ట్రం ప్రేరణ పొందింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..