కదులుతున్న కారుపై కవ్విస్తూ డాన్స్ చేస్తున్న మహిళా.. ఫైర్ అవుతున్న నెటిజెన్స్
రీల్‌తో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ప్రయత్నించింది. ఒక వ్యక్తి లగ్జరీ కారు డ్రైవ్ చేయగా బానెట్‌పై నిల్చొన్న మహిళ ‘ఆరా డ్యాన్స్’ చేసింది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు జంటను అరెస్ట్ చేశారు. నవీ ముంబైకు చెందిన నజ్మిన్ సుల్దే, అల్ఫేష్ షేక్ కలిసి వైరల్ వీడియో కోసం ప్రయత్నించారు. మెర్సిడెస్ కారును అల్ఫేష్ డ్రైవ్ చేశాడు.
బానెట్‌పై ప్రమాదకరంగా నిల్చొన్న నజ్మిన్ కారు కదులుతుండగా బాగా పాపులరైన ‘ఆరా ఫార్మింగ్’ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జంటను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రజా భద్రతకు ప్రమాదం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత షరతులతో వారిని విడిచిపెట్టారు. నజ్మిన్ సుల్దే, అల్ఫేష్ షేక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. వైరల్ స్టంట్ ద్వారా తాము తప్పు చేశామని అన్నారు. ఇందులో తనదే పూర్తిగా తప్పని నజ్మిన్ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రియురాలిని వశం చేసుకోవాలని చేయకూడని పని చేసాడు.. చివరికి
కళ్లాపి పొడి కాదు.. ప్రాణాంతక విషం! మహిళలూ జాగ్రత్త!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
టెంకాయి, రూపాయితోనే మూడు ముళ్లు.. కట్నం గొడవే లేని ఆదర్శ గ్రామాలు
సమాధిలో 2,300 ఏళ్ల నాటి మద్యం లభ్యం
డాన్స్ రాకపోతే రాదని చెప్పాలి. కానీ పెళ్లి చెడగొట్టుకుంటావా సామీ
నువ్వేం చేయాలో నీకు తెలుసు.. విమానం నుంచి దూకేసిన ఇన్స్ట్రక్టర్
పెట్రోల్ బంకులో దారుణం.. పెట్రోలు కొట్టించుకొని..

