AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా కూడా మోసపోయారట.. కానీ ప్రతి దాని వెనుక ఓ నీతి ఉంటుందంటూ ట్వీట్..

ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. ఆయన చేసే ప్రతి పోస్టు ఎంతో ఆలోచింపజేసేదిగా, విజ్ఞానాన్ని పంచేదిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల సిక్స్ సీటర్..

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా కూడా మోసపోయారట.. కానీ ప్రతి దాని వెనుక ఓ నీతి ఉంటుందంటూ ట్వీట్..
Anand Mahindra
Amarnadh Daneti
|

Updated on: Dec 13, 2022 | 12:36 PM

Share

ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అనేక ఆసక్తికర పోస్టులను షేర్ చేస్తూ ఉంటారు. ఆయన చేసే ప్రతి పోస్టు ఎంతో ఆలోచింపజేసేదిగా, విజ్ఞానాన్ని పంచేదిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల సిక్స్ సీటర్ వెహికల్ గురించి షేర్ చేసి, ఓ యువకుడి ప్రతిభను విశ్వానికి తెలిసేలా చేశారు ఆయన . ప్రతి సోమవారం ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేసే ఆనంద్ మహీంద్ర తాజాగా మండే మోటివేషన్ హ్యాష్‌ ట్యాగ్‌ జోడిస్తూ చేసిన ఓ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆనంద్ మహీంద్ర పోస్టు చేసిన వీడియోలో ఓ విమానం గాల్లో చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈలోపు అది జనవాసాల్లోకి దూసుకొస్తున్నట్లుగా చాలా కింది నుంచి వెళ్తోంది. చుట్టుపక్కల జనమంతా ఆ విమానం వైపే చూస్తున్నారు. చివరకు చూస్తే ఆ విమానాన్ని ఓ యువకుడు చేత్తో పట్టేసుకున్నాడు. అప్పుడు అందరికి అర్థమైంది అది బొమ్మ విమానం అని.. ఆ దృశ్యం ఎక్కడదనేది స్పష్టత లేనప్పటికి.. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇది చివరకు తనను కూడా మోసం చేసిందన్నారు. అయినప్పటికి ఈ వీడియో వెనుక ఓ నీతి ఉందంటూ ట్వీట్ చేశారు. మన సమస్యలను, భయాలను ఉన్నవాటికంటే పెద్దవిగా చూస్తామని.. అయితే ప్రతి సమస్యకూ పరిష్కారం మన చేతుల్లోనే ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.

ఆనంద్ మహీంద్రనే కాకుండా ఆ వీడియో చూసిన ఎవరికైనా అది బొమ్మ విమానం అని కనిపెట్టడం అసాధ్యం. కొద్దిసేపు అయిన తర్వాత.. అది తన గమ్యానికి చేరుకునేసరికి ఓ యువకుడు చేతితో పట్టుకోవడంతోనే అది నిజమైన విమానం కాదని తెలుస్తోంది. అంతే కొన్ని సంఘటనలు ఎలాంటి వ్యక్తులను అయినా మోసం చేస్తాయనడానికి ఇదో పెద్ద ఊదహరణగా ఆయన చెప్పకనే చెప్పారు.

ఇవి కూడా చదవండి

కొద్ది గంటల క్రితం పోస్టు చేసిన ఈ ట్వీట్‌ ను ఎప్పటివరకు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. వేలాది మంది లైక్‌ చేశారు. అలాగే అనేకమంది నెటిజన్లు తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఆనంద్ మహీంద్ర పోస్టు చేసిన వీడియోకు ఇచ్చిన వివరణ ఎంతో ప్రేరణగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే.. భయం అనేది మన ఆలోచనపై ఆధారపడి ఉంటుందని మరొ నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర పోస్టు చేసిన వీడియో మాత్రం సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..