Viral News: ఇప్పటికి ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారు.. విద్యార్థులకు నైతిక విలువల బోధన.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో..
కొన్ని సంఘటనలు చూస్తే.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవే అనిపిస్తూ ఉంటాయి. ఎంతో బాధ కూడా కలుగుతుంది. ప్రస్తుతం కాలం మారుతుంది. కాలంతో పాటు మనుషులు మారుతున్నారు. స్వార్థం అనే భావన ప్రతి ఒక్కరిలో ఎక్కువైపోయింది. తన అవసరం తీరితే..

కొన్ని సంఘటనలు చూస్తే.. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు లేవే అనిపిస్తూ ఉంటాయి. ఎంతో బాధ కూడా కలుగుతుంది. ప్రస్తుతం కాలం మారుతుంది. కాలంతో పాటు మనుషులు మారుతున్నారు. స్వార్థం అనే భావన ప్రతి ఒక్కరిలో ఎక్కువైపోయింది. తన అవసరం తీరితే చాలు.. మిగతా వాళ్లు ఏమైపోతే నాకేంటనే ఆలోచనతోనే చాలా మంది ఉంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుత విద్యావిధానం, పోటీ తత్వం, మనుషుల ఆలోచన అలాంటివాటికి కారణం అని చెప్పుకోవాలి. గతంలో పాఠశాలల్లో కేవలం విద్యా బోధనే కాకుండా నైతిక విలువలు, మానవ విలువల గురించి బోధించేవారు. కాని రానూరానూ పరిస్థితులు మారిపోయాయి. పాఠ్యపుస్తకాల్లో అంశాలనే బట్టీపట్టించి.. చదువులను బలవంతంగా రుద్దించే పరిస్థితులు కొన్నిచోట్ల కనిపిస్తున్నాయి. కేవలం మార్కులు, పోటీ.. తప్ప చదువులో క్వాలిటీ గురించి ఎవరూ ఆలోచించడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మహారాష్ట్రలోని థానేలోని ఓ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదిలో విద్యార్థులు వేసిన ఓ స్కిట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నైతిక విలువల గురించి ఈ వీడియోలో విద్యార్థుల బృందం ఓ స్కిట్ రూపొందించింది. బహుశా వాళ్ల టీచర్ గైడెన్స్‌తోనే విద్యార్థులు ఆ స్కిట్ రూపొందించినట్లె తెలుస్తోంది. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో జపాన్‌లో కూడా ఓ పాఠశాల విద్యార్థులు ఇలాంటి స్కిట్‌ను ప్రదర్శించారు.
తరగతిగదిలో బస్సులో ఉండేలా కుర్చీలను సీట్లలా ఏర్పాటుచేశారు. ఆ సీట్లలో విద్యార్థులంతా కూర్చున్నారు. ముందు ఉన్న విద్యార్థి డ్రైవర్‌లా బస్సును డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని ఉన్నారు. ఒక్కో స్టాప్‌లో ఒక్కొక్కరూ బస్సు ఎక్కుతుంటే కొంతమంది లేచి.. బస్సు ఎక్కిన వారికి సీట్లు ఇవ్వడం వీడియోలో కనిపిస్తోంది. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఇలా ఒక్కో వేషధారణలో ఉన్న వారు బస్సు ఎక్కుతుంటే తోటి వారు లేచి వారికి సీట్లు ఇస్తున్నట్లు కనబడుతోంది. వాస్తవానికి బస్సుల్లో మహిళలకు, వృద్ధులకు, ఎవరికి వారికి సీట్లు ప్రత్యేకంగా కేటాయించి ఉంటాయి. అయితే ఎవరికి కేటాయించిన సీట్లను వారికి ఇవ్వకుండా ఆ సీట్లలో అందరూ కూర్చుని ఉంటూ ఉంటారు. రానూరానూ అంతా నైతిక విలువలపు మర్చిపోతున్న ఈ తరుణంలో వాటిని గుర్తు చేసేలా విద్యార్థులు రూపొందించిన స్కిట్‌కు సంబంధించిన వీడియోను ఐఎఎస్ అధికారి మనుజ్ జిందాల్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.




సృజనాత్మక కలిగిన ఉపాధ్యాయులు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పౌర విలువలు ఎలా బోధిస్తున్నారనే అంశం ఈ క్లిప్‌లో ఉందంటూ ఈ పోస్టులో రాశారు ఐఎఎస్ అధికారి. ఇది చూస్తే కళ్లల్లో కన్నీళ్లు రావడం గ్యారంటీ అంటూ పేర్కొన్నారు. థానేలోని ఇంద్‌గావ్ పాఠశాలకు సంబంధించిన వీడియోగా కూడా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
How our creative teachers are teaching ‘Civic Values’ in rural schools.
Here’s a beautiful clip where students enacted scene offering seats to fellow needy passengers in an invisible bus..
Guaranteed to bring tears to your eyes. pic.twitter.com/2ShlL3sftZ
— Manuj Jindal (@manujjindalIAS) December 2, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..