Viral News: ఈ ప్రదేశం పుస్తక పాఠకులకు స్వర్గం.. వేల పుస్తకాలతో చేసిన బుక్ టవర్.. ఎక్కడంటే
పుస్తకం హస్త భూషణం అన్నారు పెద్దలు. పుస్తకాలను చదవడం వలన విజ్ఞానం, జ్ఞానం, విలువలు వంటి అనేక విషయాలను తెలుసుకుంటారు. అయితే కాలంతో పాటు వచ్చిన మార్పుల్లో పుస్తకం చదవం అనే అలవాటు అరుదుగా కనిపిస్తుంది నేటి యువతలో.. అందుకే లైబ్రెరీలు కనిపిచడం అరుదు. అయితే మీరు పుస్తక ప్రియులైతే... ఒక గమ్యస్థానం ఉంది. ఇక్కడ ఒక పుస్తక టవర్ ఉంది. దీనిలోకి తొంగి చూస్తే, లోతు చూసి ఆశ్చర్యపడాల్సిందే ఎవరైనా..

పుస్తకాలను ఇష్టపడే వారికి లైబ్రరీలో ఒక చిన్న చోటు దొరికినా చాలు స్వర్గంగా భావిస్తారు. తమకు ఇష్టమైన పుస్తకాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చదవగలిగే ప్రదేశం. అయితే ఒకే ప్లేస్ లో చాలా పుస్తకాలు మాత్రమే కాదు మొత్తం పుస్తకాలే ఒక టవర్ గా కనిపిస్తే.. దానిని చూడటం పుస్తక ప్రియులకు మాత్రమే కాదు.. ఎవరికైనా ఒక అద్భుతమైన దృశ్యంగా అనిపిస్తుంది. ఇలాంటి బుక్ టవర్ ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. ఈ బుక్ టవర్ మన దేశంలో కాదు చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో ఉంది. ఈ ప్రదేశం దాని సాంస్కృతిక వారసత్వం, కళాత్మక నిర్మాణాలతో ప్రసిద్ధి చెందింది. వీటితో పాటు ఇక్కడ ఉన్న బుక్ టవర్‌ను మిస్ చేయవద్దు.
ప్రేగ్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ప్రేగ్ కాజిల్ (ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద కోటలలో ఒకటి), చార్లెస్ బ్రిడ్జ్ (14వ శతాబ్దపు నిర్మాణం.. అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానం), రంగురంగుల భవనాలు చాలా అందంగా కనిపించే ఓల్డ్ టౌన్ స్క్వేర్, ఖగోళ గడియారం అత్యంత ప్రసిద్ధ ప్రదేశం. అయితే వీటితో పాటు ఈ దేశానికి స్పెషల్ గుర్తింపు తీసుకొస్తుంది బుక్ టవర్. ఇడియమ్ బుక్ టవర్ అని పిలువబడే ఈ బుక్ టవర్ గురించి తెలుసుకుందాం.
ఇడియమ్ బుక్ టవర్ ఈ టవర్..గొప్ప గొప్ప పుస్తకాల సేకరణతో ఏర్పడింది. అంతేకాదు ఈ ప్రదేశం చాలా ప్రత్యేకమైన కళాకృతి. ఇది కళకు గొప్ప ఉదాహరణ. ఈ టవర్‌ను 1998లో స్లోవాక్ కళాకారుడు మాటేజ్ క్రేన్ నిర్మించారు. ఎవరైనా ఈ టవర్ ను చూసినప్పుడు.. చాలా లోతుగా కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. అయితే ఇది నిజమైన లోతు కాదు.. అయితే ఇలా కనిపించేలా గాజుతో తయారు చేయబడిన ఒక ఆప్టికల్ చిత్రం. పుస్తకాల ప్రతిబింబం గాజులో కనిపించినప్పుడు.. అది ఒక అద్భుతమైన దృశ్యంగా చూపరులకు దర్శనం ఇస్తుంది.
వేలాది పుస్తకాలతో టవర్ ఈ పుస్తక గోపురం ప్రేగ్ మున్సిపల్ లైబ్రరీలో నిర్మించబడింది. దీని తయారీకి దాదాపు 8,000 పాత పుస్తకాలు ఉపయోగించబడ్డాయి. పైన, కింద రెండు వైపులా అనంతమైన (ఎప్పటికీ అంతం కాని) లోతు అనుభూతిని కలిగించే విధంగా అద్దాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ప్రదేశం సాహిత్య ప్రియులకు మాత్రమే కాదు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కూడా అందమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇది ప్రేగ్‌లోని అత్యంత ప్రసిద్ధ, అందమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
ఈ టవర్ పేరు ఏమిటి? అక్కడి ప్రజలు ఇడియం బుక్ టవర్‌ను “కాలమ్ ఆఫ్ నాలెడ్జ్” అని పిలుస్తారు. ఈ ప్రదేశం దీని ప్రత్యేకత కారణంగా సోషల్ మీడియాలో హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ప్రదేశంలో ఇక్కడ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కూడా చేయవచ్చు. దీనిలోపలకు తొంగి చూసేందుకు ఒక ఆకుతో రూపొందించిన విండో ఉంది. అక్కడ నుంచి ఎవరైనా సరే అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు.
ఎంట్రీ టైమింగ్ ఏమిటంటే ఈ పుస్తక టవర్‌ను చూడటానికి ప్రేగ్ మున్సిపల్ లైబ్రరీకి చేరుకోవాలి. ఇక్కడికి మెట్రో ద్వారా చేరుకోవచ్చు. ఎంట్రీ సమయం ఎప్పుడంటే.. సమాచారం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 7:30 వరకు ఇక్కడ సందర్శించవచ్చు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఈ లైబ్రరీ ఉదయం 9 నుంచి సాయంత్రం 7:30 వరకు తెరిచి ఉంటుంది. శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ లైబ్రెరీని సందర్శించవచ్చు. అయితే ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలనుకున్నట్లు అయితే స్థానిక ప్రజల నుంచి సమయాన్ని నిర్ధారించుకోండి.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..