Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Pakoda: సండే స్పెషల్.. చికెన్ పకోడీ.. వేడి వేడిగా అందించండి.. తిన్న వెంటనే వావ్ అంటారు

నాన్ వెజ్ ప్రియులు ఆదివారం వస్తే చాలు చికెన్ , మటన్, రొయ్యలు చేపలు వంటి రకరకాల ఆహారాన్ని తినాలని కోరుకుంటారు. అయితే మాంసాహార ప్రియులలో చికెన్ ప్రియులు వేరు అని చెప్పవచ్చు. చికెన్ తో కూర, వేపుడు, బిర్యానీ, పచ్చడి ఇలా రకరకాల ఆహారాన్ని చేసుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే వర్షాకాలంలో వేడి వేడిగా పకోడీలు తినాలిపిస్తే.. చికెన్ పకోడీని ట్రై చేయండి. తిన్న వెంటనే వావ్ అంటారు.

Chicken Pakoda: సండే స్పెషల్.. చికెన్ పకోడీ.. వేడి వేడిగా అందించండి.. తిన్న వెంటనే వావ్ అంటారు
Chicken Pakoda Recipe
Surya Kala
|

Updated on: Jul 06, 2025 | 12:37 PM

Share

వర్షాకాలం వస్తే చాలు వేడి వేడిగా స్నాక్స్ తినాలని కోరుకుంటారు. అందుకే బజ్జీలు, మొక్కన్న జొన్న పొత్తులు వంటివి తినడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే నాన్ వెజ్ ప్రియులు ఈ స్నాక్స్ గా కూడా మాంసాహారం ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారికీ చికెన్ పకోడీలు బెస్ట్ స్నాక్ అని చెప్పవచ్చు. ఈ చికెన్ పకోడీలు ఒక ప్రసిద్ధ భారతీయ చిరుతిండి. ఈ చికెన్ పకోడీలు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా మసాలా రుచితో ఉండి ప్రసిద్ధి చెందాయి. ఈ చికెన్ పకోడీలు టీతో లేదా ఏ సందర్భంలోనైనా రుచికరమైన స్నాక్‌గా వడ్డించవచ్చు. దీనిని తయారు చేయడం సులభం. తక్కువ పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. ఈ రోజు చికెన్ పకోడీ తయారీ గురించి తెల్సుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

  1. బోన్ లెస్ చికెన్- 500 గ్రాములు
  2. శనగ పిండి- 1 కప్పు
  3. పెరుగు- 1/2 కప్పు
  4. గుడ్డు- 1
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
  6. పచ్చిమిర్చి- 1 (సన్నగా తరిగిన)
  7. పసుపు – 1/2 టీస్పూన్
  8. కారం-1 టీస్పూన్
  9. ధనియాల పొడి- 1 స్పూన్
  10. గరం మసాలా- 1/2 స్పూన్
  11. ఉప్పు- రుచికి సరిపడా
  12. వేయించడానికి నూనె
  13. కరివేపాకు-
  14. కొత్తిమీర -(సన్నగా తరిగినవి)
  15. నిమ్మరసం – సగం చెక్క

తయారీ విధానం:

  1. ముందుగా చికెన్ ను శుభ్రం చేసి.. చిన్న ముక్కలుగా కోసి ఒక గిన్నెలో వేసుకోవాలి.
  2. ఇప్పుడు ఈ చికెన్ లో అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపండి.
  3. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ ను ఒక పక్కకు పెట్టి సుమారు 20 నిమిషాలు అలా ఉంచండి.
  4. వేరే గిన్నె తీసుకుని ఇప్పుడు శనగపిండి, పెరుగు, గుడ్డు, కొంచెం నీరు వేసి బాగా కలిపి.. కొంచెం మందంగా ఉండేలా పిండిని సిద్ధం చేయండి. పిండిలో ఎటువంటి ముద్దలు ఉండకుండా బాగా కలపండి. అంటే గడ్డ పెరుగులా ఉండే విధంగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
  5. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. వేయించడానికి సరిపడా నూనె పోసుకుని నూనెను వేడి చేయండి.
  6. మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను పిండిలో ముంచి.. ఈ వేడి నూనెలో వేసి.. చికెన్ బంగారు గోధుమ రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేయాలి.
  7. ఈ నూనె లో కరివేపాకు వేసి వేయించి తీసుకోండి.
  8. ఇలా తయారుచేసిన పకోడాలను టిష్యూ పేపర్ మీద తీసివేసి, అదనపు నూనెను తొలగించుకోండి. తర్వాత కొత్తిమీర, వేయించిన కరివేపాకుతో అలంకరించి.. వేడి టీతో సర్వ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కపిల్ శర్మ కేఫ్ పై ఉగ్రవాదుల కాల్పులు..
కపిల్ శర్మ కేఫ్ పై ఉగ్రవాదుల కాల్పులు..
కోపంతో నియంత్రణ కోల్పోతున్నారా.. గ్రహలు కావొచ్చు.. పరిహారాలు ఇవే
కోపంతో నియంత్రణ కోల్పోతున్నారా.. గ్రహలు కావొచ్చు.. పరిహారాలు ఇవే
రూ.900 కోట్ల హీరోయిన్.. లంబోర్గిని ఉన్నా చిన్న స్విఫ్ట్ కారులోనే.
రూ.900 కోట్ల హీరోయిన్.. లంబోర్గిని ఉన్నా చిన్న స్విఫ్ట్ కారులోనే.
భారతదేశంలో ప్రవహించే మృత్యునది..! ఈ పేరు ఎలా వచ్చిందంటే..
భారతదేశంలో ప్రవహించే మృత్యునది..! ఈ పేరు ఎలా వచ్చిందంటే..
వేణు స్వామి భార్య ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక సమస్యలు
వేణు స్వామి భార్య ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక సమస్యలు
ఈ రాశి అమ్మాయిలు మీ లైఫ్‌లో అడుగుపెడితే అదృష్టమే
ఈ రాశి అమ్మాయిలు మీ లైఫ్‌లో అడుగుపెడితే అదృష్టమే
బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఓట్స్ కట్లెట్ తయారీ విధానం
బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఓట్స్ కట్లెట్ తయారీ విధానం
గుండెపోటు, గ్యాస్ నొప్పికి మధ్య 5 తేడాలివే..
గుండెపోటు, గ్యాస్ నొప్పికి మధ్య 5 తేడాలివే..
రోటీ పిండి మిగిలిపోయిందని ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారా..? డేంజర్
రోటీ పిండి మిగిలిపోయిందని ఫ్రిజ్ లో నిల్వ చేస్తున్నారా..? డేంజర్
ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఐపీఎల్ vs చంపక్ బీసీసీఐ వాదనలు
ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన ఐపీఎల్ vs చంపక్ బీసీసీఐ వాదనలు