వర్షాకాలంలో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? ఇది బెస్ట్ ప్లేస్..! తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందం..!!
భారతదేశంలో చారిత్రక భవనాలు, రాజభవనాలకు కొరత లేదు. ముఖ్యంగా రాజస్థాన్‌లో ఇటువంటి చారిత్రక భవనాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని వందల, కొన్ని వేల సంవత్సరాల పురాతనమైనవి. ఈ రాజభవనాలు, కోటలు చారిత్రక భవనాలను భారతదేశ చరిత్ర, దాని గర్వం, వైభవంగా పిలుస్తారు. ఇకపోతే, ఈ భవనాలు వాటిలో అనేక రహస్యాలను దాచి ఉంచాయి. ఈ రోజు మనం అలాంటి ఒక వారసత్వ సంపద గురించిన వివరాలను తెలుసుకుందాం.. ఇది 300 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కానీ అది ఇప్పటికీ అదే వైభవంతో నిలుస్తుంది. అంతేకాదు.. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో నచ్చుతుంది ఈ భవనం. అదే జైపూర్ లోని జల మహల్. వర్షాకాలంలో ఈ భవనం మరింత అందంగా కనిపిస్తుంది. జల్ మహల్ అనేది ఐదు అంతస్తుల రాజభవనం. వీటిలో నాలుగు అంతస్తులు నీటిలో ఉన్నాయి. వీటిని మీరు చూడలేరు. నీటి పైన ఒక అంతస్తు మాత్రమే కనిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5